సినిమా పోయినా…శెటైర్స్ ఆగలేదు!!!

  • July 23, 2016 / 10:33 AM IST

కబాలి…కబాలి…కబాలి…దాదాపుగా ఈ సినిమా ఫర్స్ట్ లుక్ విడుదల అయిన సమయం నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అదే క్రమంలో ఈ సినిమా ఏ హీరోకి లేనంతగా భారీ అంచనలతో నిన్న ప్రేక్షకుల మధ్యకు వచ్చిన సంగతి తెలిసిందే. విషయం లోకి వెళితే….నిన్న విడుదలయిన కబాలి సినిమా బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. తొలుత అందరూ మిక్స్డ్ టాక్ అనుకున్నా…ఇది చివరకు బ్యాడ్ టాక్ తో, డిజాస్టర్ గా మిగిలిపోయింది.

ఇక తమిళ ప్రేక్షకులకు ఈ సినిమా ఓకే అనిపించినా, తెలుగులో మాత్రం రాజని కరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎంతటి హైప్ సృష్టించిందో అంతటి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక అదే క్రమంలో ఈ సినిమాపై శెటైల్స్, పేరడీలు విపరీతంగా పెరిగిపోయాయి…‘బాహుబలి’ ఓవర్సీస్ రికార్డులను బ్రేక్ చేసిన ‘కబాలి’ సెటైర్ల విషయంలో కూడ ‘బాహుబలి’ ని మించిపోయింది అన్న టాక్ కనిపిస్తుంది…. ‘వెబ్ మీడియాలో చాలామంది ‘కబాలి’ ని ఒక ఆటాడుకుంటున్నారు.

సోషల్ మీడియాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ మీద ‘కబాలి’ వీడియో –  మెగాస్టార్‌ మీదా –  అల్లరి నరేష్‌ మీదా, కొందరు అయితే ముందుకు వెళ్ళి మరీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ను మోర్ఫింగ్ చేసి….మరి చూస్తున్నారు….ఇక  ఇలా అందరూ టాప్ సెలెబ్రెటీలు ‘కబాలి’ పాత్రను చేస్తే ఎలా ఉంటుందో వారు నటించిన వివిధ సినిమాల్లోని సీన్లు తీసుకుని వాటిని ‘కబాలి’ టీజర్‌ని పోలి ఉండేలా రూపొందించి సెటైర్లు వెసేస్తున్నారు. మొత్తానికి కబాలి సినిమా పరంగా పోయినా…సూపెర్‌స్టార్ క్రేజ్ కు మాత్రం ఎక్కడా మచ్చ పడలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus