విక్టరీ వెంకటేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతుంది. అదే ‘ఆదర్శ కుటుంబం- AK47′(Aadarsha Kutumbam AK 47). గతంలో వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సినిమాలు ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘వాసు’ ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలకి త్రివిక్రమ్ రైటర్ గా పనిచేశారు. ఇందులో ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘మల్లీశ్వరి’ సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి… ‘వాసు’ మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ ఆ సినిమా అండర్ రేటెడ్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసించే జనాలు ఎక్కువే.
అయితే త్రివిక్రమ్ దర్శకుడిగా మారాక వెంకటేష్ తో చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఆదర్శ కుటుంబం- AK47′ పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తోంది.ఇందులో భాగంగా కొన్ని కీలక మార్పులు కూడా చేసినట్టు తాజా సమాచారం.
విషయంలోకి వెళితే.. ఈ సినిమా కోసం ‘లక్కీ భాస్కర్’ కి పని చేసిన బన్‌గ్లాన్ అనే ఆర్ట్ డైరెక్టర్ ని తీసుకొని ఓ ఇంటి సెట్ వేయించారు. అయితే అది దర్శకుడు త్రివిక్రమ్ కి నచ్చలేదట. నిర్మాత త్రివిక్రమ్..కి ఎంత చెబితే అంత. అందుకే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ప్రకాష్ అనే మరో ఆర్ట్ డైరెక్టర్ ని తీసుకుని మరో సెట్ వేశారట. షూటింగ్ మొత్తం అక్కడే జరుగుతుంది అని తెలుస్తుంది.
కెమెరామెన్ విషయంలో కూడా ఇలాంటి మార్పే జరిగినట్టు తెలుస్తుంది. కొంత భాగం షూటింగ్ అయిన తర్వాత కెమెరామెన్ ని మార్చాల్సి వచ్చిందట. దీంతో అనవసరమైన ఖర్చు అయినట్టు టాక్ నడుస్తుంది. కానీ ఫైనల్ గా ఔట్పుట్ బాగా వస్తే.. ఇలాంటివి లెక్కల్లోకి రావు అనే చెప్పాలి.మరోవైపు ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే అదే టైంకి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని..ల సినిమా అలాగే ప్రభాస్ ఫౌజి వంటి పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరి ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి.