‘ఎన్టీఆర్ కథానాయకుడు’ పై ఫైర్ అవవుతున్న సావిత్రి అభిమానులు..?

సావిత్రి జీవిత ఆధారంగా తెరెకెక్కిన ‘మహానటి’ చిత్రం ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో సావిత్రి కుటుంబం మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ మొదటిభాగం అయిన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రంలో సావిత్రి సీన్స్ పై సావిత్రి ఫ్యామిలీ తో పాటు కొందరు అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇక ఈ చిత్రంలో సావిత్రి.. ఏఎన్నార్ ఇంటిని కొనడానికి అతనికి బ్లాంక్ చెక్ ఇవ్వడం…తరువాత ఏఎన్నార్.. సావిత్రికి క్లాస్ పీకడం, తరువాత ఎన్టీఆర్ కూడా డబ్బు విలువ తెలుసుకోమని సావిత్రికి చెప్పడం వంటివి ఈ చిత్రంలో చూపించడాన్ని కొందరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారట.

ఈ సీన్స్ పై సావిత్రి కూతురు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయం పై ఆమె కూతురు స్పందిస్తూ.. “తన తల్లికి డబ్బు విలువ తెలుసు, అక్కినేని లాంటి వ్యక్తితో ఇంటి గురించి బేరాలు ఆడడం ఇష్టంలేక ఆయన పై ఉన్న నమ్మకంతో బ్లాక్ చెక్ ఇచ్చింది సావిత్రి. అయితే ఈ చిత్రంలో మరోరకంగా చూపిస్తూ సావిత్రి వ్యక్తిత్వం పై తప్పు అభిప్రాయం వచ్చేలా చూపించారు క్రిష్. ” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే సావిత్రి కుటుంబానికి సన్నిహితులైన ఓ వ్యక్తి.. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు తాగుడు అలవాటు ఉండేదని దాని కారణంగా అమెరికాలో ఇద్దరికీ గుండె ఆపరేషన్ కూడా జరిగిందని.. కానీ అలాంటి సన్నివేశాలు మాత్రం ఈ చిత్రంలో చూపించలేదని…. సావిత్రిని మాత్రం తప్పుగా చూపిస్తారా..? ఎన్టీఆర్,ఏఎన్నార్ లను ఎందుకు తప్పుగా చూపించలేదంటూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus