Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్
- November 8, 2026 / 12:37 AM ISTByPhani Kumar
‘వీరభద్రుడు’ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో సూపర్ ఫామ్లోకి వచ్చిన సూర్య.. ఇప్పుడు ‘సీన్'(Scene) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నజ్రియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మలయాళం యంగ్ సెన్సేషన్ నస్లెన్ కూడా కీలక పాత్ర పోషించారు. ‘జగరం స్టూడియోస్’ ‘2D ఎంటర్టైన్మెంట్’ సంస్థలపై సూర్య-జ్యోతిక ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించాయి.
Scene
ట్రేడ్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బిజినెస్ చేసింది ఈ ‘సీన్’. ఆలస్యం చేయకుండా.. ‘సీన్’ సినిమాకి ఎంత ధియేట్రికల్ బిజినెస్ జరిగిందో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసుకుందాం రండి :

| నైజాం | 5 cr |
| సీడెడ్ | 1.5 cr |
| ఆంధ్ర(టోటల్) | 5 cr |
| ఏపీ +తెలంగాణ(టోటల్) | 11.5 cr |
| తమిళనాడు | 40 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + మలయాళం | 6 cr |
| కర్నాటక | 5 cr |
| ఓవర్సీస్ | 15 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 77.5 cr |
‘సీన్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.77.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం రూ.78 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే రూ.11.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ కోసం రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ కనుక వస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.












