మహేష్ స్పైడర్ సెకండ్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

  • June 16, 2017 / 12:28 PM IST

ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్.. సినిమా రిలీజ్ కి ముందు వీటితో హంగామా చేయడం కామన్. ఈ స్టైల్ క్రమంగా మారుతోంది. అభిమానుల కోరికమేరకు మరిన్ని సినిమా వీడియోస్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం డీజే కి రెండు ట్రైలర్ రిలీజ్ చేసి కొత్త ట్రెండ్ సృష్టించారు. ఇప్పుడు మహేష్ మరో ట్రెండ్ సృష్టించడానికి రెడీ అవుతున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న స్పైడర్ మూవీ టీజర్ ఈనెల మొదటి తేదీన రిలీజ్ అయి కోటీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ క్రేజ్ ని గమనించిన మురుగదాస్ బృందం మరో టీజర్ ని రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు.

ఒక నిముషం నిడివిగల రెండో టీజర్ ని జులై 1 వ తేదీన విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యారు. ఆగస్టు 9 న ట్రైలర్ రిలీజ్ అవుతోంది. అందుకు చాల సమయం ఉండడంతో అప్పటి దాకా అభిమానులను నిరుత్సాహపడకుండా ఉండాలని సెకండ్ టీజర్ రిలీజ్ చేయాలనీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27 న థియేటర్లోకి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus