రంగస్థలం 1985 ఫస్ట్ లుక్ ఆలస్యానికి కారణం అదేనంట!

యువ హీరోలను సరికొత్త కథలో చూపించడంలో సుకుమార్ దిట్ట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇమేజ్ ని పక్కన పెట్టి పక్క పల్లెటూరి కుర్రోడిలా నటింపజేయిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా రంగస్థలం 1985. టైటిల్ ల్లోనే ఇది పాతికేళ్ల నాటి కథ అని స్పష్టం చేశారు. నేటి ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందించడానికి అలనాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టేలా భారీ సెట్ వేయియించారు. అందులోనే చరణ్, సమంతలపై ప్రస్తుతం కొన్ని సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ లుక్ దీపావళికి వస్తుందని అందరూ ఎదురు చూసారు.

రాకపోవడంతో నిరుత్సాహపడ్డారు. దీనిపై ఇంకా ప్రకటన కూడా చేయలేదు. ఎందుకు ఫస్ట్ లుక్ విషయంలో ఆలస్యం అవుతుందని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఈ సినిమా కథ, టైటిల్ మాత్రమే కాదు పోస్టర్ కూడా ఆనాటి కాలాన్ని గుర్తుకు తెచ్చేదిగా ఉండాలని సుకుమార్, రామ్ చరణ్ డిసైడ్ అయ్యారు. అందుకు తగినట్టుగానే డిజైన్ చేస్తున్నట్లు తెల్సింది. ఫస్ట్ లుక్ మాత్రమే కాదు… ఈ సినిమా పోస్టర్స్ అన్నీ పాతకాలపు స్టైల్లో ఉండనుందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus