“ఆర్‌ఎక్స్ 100” విజయానికి ప్రధాన కారణమైన పాయల్ రాజ్‌పుత్!

  • July 17, 2018 / 01:19 PM IST

అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే గురించి ఎలా మాట్లాడుకున్నారో.. అదే విధంగా ఇప్పుడు “ఆర్‌ఎక్స్ 100” సినిమాలోని కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ గురించి మాట్లాడుకుంటున్నారు. కార్తికేయ కి ఇదివరకు సినిమా ఏమిలేకపోవడంతో విజయ్ తో సమానమైన క్రేజ్ రాలేదు కానీ.. పాయల్ మాత్రం షాలిని పాండేని మించిపోయింది. యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమా గతవారం రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. బడ్జెట్ ని రెండురోజుల్లో రాబట్టిన ఈ సినిమా పది కోట్ల గ్రాస్ ని అధిగమించి దూసుకుపోతోంది.  చిన్నసినిమాలకు రిపీట్ ఆడియన్స్ అరుదుగా వస్తుంటారు. కానీ ఈ సినిమాని యువత, మాస్ ఆడియన్స్ మళ్ళీ చూస్తున్నారు. అందుకు పాయల్ రాజ్ పుత్ అని సినీ విశ్లేషకులు చెప్పారు.

ఆమె రొమాన్స్, పెర్ఫార్మెన్స్ అదిరిపోయాయని కితాబు ఇస్తున్నారు. ఆమెకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఇదే చివరి చిత్రమన్నంత కసిగా.. అందాలు ఆరబోసింది. బోల్డ్ పాత్రలను ఇదివరకు ఎంతోమంది చేశారు కానీ.. నెగిటివ్ షేడ్స్ కలిగిన ఈ రోల్ పాయల్ కి అభినందనలు గుప్పిస్తోంది. ఏ నలుగురు సినీ అభిమానులు కలిసినా ఈ చిత్ర గురించి, అందులో పాయల్ పోషించిన ఇందు పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారంటే… అతిశయోక్తికాదు. అంతలా అందాల మత్తులో పడేసింది. ఆమె డేట్స్ కోసం తెలుగు దర్శకనిర్మాతలు క్యూ కట్టడం ఖాయమని ఫిలిం నగర్ వాసులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus