సవ్యసాచి టైటిల్లో దాగున్న ఆసక్తికరమైన సంగతి
- August 18, 2017 / 07:41 AM ISTByFilmy Focus
యువ దర్శకుడు చందూ మొండేటి తొలి చిత్రం కార్తికేయ తోనే పరిశ్రమ వర్గాల దృష్టిని ఆకర్షించారు. అక్కినేని నాగచైతన్యతో ప్రేమమ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. అది రీమేక్ కాబట్టి అందులో తన మార్క్ కనిపించలేదు. ఇప్పుడు మూడో సినిమాని మొదలెట్టారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సవ్యసాచి అని పేరు పెట్టి మళ్ళీ టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారారు. ఈ టైటిల్ అర్ధం కోసం నేటి యువకులు గూగుల్లో సెర్చ్ చేశారంటే ఎంత అలోచించి పేరు పెట్టారో అర్ధం అవుతోంది. అలాగే లోగో డిజైన్ లోను తన స్టైల్ చూపించారు. మొదటి సినిమా కార్తికేయ లోగోలో గోపురం బొమ్మ చూపించి కథాంశాన్ని వివరించారు.
ఇప్పుడు సవ్యసాచి లోగోలోని ‘సా’ అనే అక్షరం మీద ఒక చేతి ముద్ర ఉంది. ఆ ముద్రను జాగ్రత్తగా గమనిస్తే అమ్మ కడుపులో ఉండే పసిబిడ్డ రూపం కనిపిస్తుంది. సో ఆ బిడ్డ చుట్టూ కథ జరగనుందన్నమాట. ఆ బొమ్మని గమనించిన వారు ఇది సైంటిఫిక్ థ్రిల్లర్ అని చెబుతుంటే.. సినీ విశ్లేషకులు మాత్రం మరోసారి కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడని చందూని అభినందిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












