క్యాస్టింగ్ కౌచ్.. ఇది కొత్త టాపిక్ ఏమీ కాదు. అలా అని తక్కువగా చూసేంత చిన్న టాపిక్ కూడా కాదు. గతంలో ‘మీటూ’ అంటూ నార్త్ తో పాటు దక్షిణాది భామలు కూడా ఓ ఊపు ఊపేసారు. తమని వేధించిన సినీ పెద్దల పై ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచారు. ఈ ఉద్యమం వల్ల సినిమాల్లో అవకాశాలు కోల్పోయిన నటీమణులు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇక క్యాస్టింగ్ కౌచ్ పని అయిపోయింది అనుకున్న టైములో ఎవరో ఒకరు దీని పై స్పందించడం జరుగుతోంది.
పోనీ కొత్త విషయాలు ఏమైనా చెప్తున్నారా అంటే అదేమీ లేదు. ‘మాకు అలాంటి చేదు అనుభవాలు ఏమీ ఎదురుకాలేదు’ అంటూ ఒకటే రొటీన్ డైలాగ్ చెప్పి దాటేస్తున్నారు. అయితే సీనియర్ నటి అన్నపూర్ణ ఈ విషయం పై స్పందించి ఆసక్తికరమైన అలాగే ఆలోచింపచేసే కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు అవసరం లేని వ్యవహారం. ప్రతి రంగంలోనూ ఇది ఉంది. ఎంతోమంది మహిళలు దీని వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే ఇల్లు, కుటుంబం, గౌరవం అనే వాటిని దృష్టిలో పెట్టుకుని సైలెంట్ అయిపోతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఒక్కరిదే తప్పు అనడం కరెక్ట్ కాదు.అది రెండు వైపులా ఉంటుంది.ఇద్దరికీ ఇష్టమైతేనే తప్పులు జరుగుతాయి. అవకాశాల కోసం తిరిగే వారికి ఇలాంటివి తప్పవు. కానీ ధైర్యంగా దానిని బయట పెట్టగలగాలి’ అంటూ చెప్పుకొచ్చింది.
Most Recommended Video
వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!