ఒకప్పటి హీరో.. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో సహాయ నటుడిగా రాణిస్తున్న ప్రభు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో ఈయన కూడా హీరోగా, సెకండ్ హీరోగా అనేక తమిళ సినిమాల్లో నటించి విజయాలు అందుకున్నారు. అయితే లెజండరీ స్టార్ హీరో శివాజీ గణేశన్ గారి అబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభు.. ఆయన రేంజ్లో అయితే సక్సెస్ కాలేదు. అలా అని తొందరగా ఫేడౌట్ అయిపోయిన హీరో కూడా కాదు.
తెలుగులో కూడా ఈయన చాలా హిట్ సినిమాల్లో నటించారు. ‘డార్లింగ్’ ‘ఆరెంజ్’ ‘దేనికైనా రెడీ’ ‘ఒంగోలు గిత్త’ ‘దరువు’ ‘రంగ రంగ వైభవంగా’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. అయితే ఈయన గతంలో కుష్బూ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి నటి కాకినాడ శ్యామల ఓ ఇంటర్వ్యూలో తెలియజేసారు. చిన్న తంబి సినిమాలో ప్రభు- ఖుష్బూ జంటగా నటించారు.
ఆ టైంలో వీరి మధ్య పరిచయం, ప్రేమ ఏర్పడింది. ఈ చిత్రం రిలీజ్ అయిన రెండేళ్లకి అంటే.. 1993, సెప్టెంబర్ 12న వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే అప్పటికే ప్రభుకు పెళ్లి అయ్యింది. ఇది పెద్ద షాకిచ్చే అంశం. అయినా ఖుష్బూని.. రెండో వివాహం చేసుకున్నాడు. అయితే వీరి పెళ్లిని ప్రభు తండ్రి శివాజీ గణేశన్.. అంగీకరించలేదు. అందుకే వీరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. 4 నెలలకే విడిపోయారు.
ప్రభు (Prabhu) భార్య కూడా వీరి పెళ్లిని అంగీకరించకుండా కోర్టుకెక్కుతాను అని బెదిరించడంతో వీరు విడాకులు తీసుకోక తప్పలేదు. అటు తర్వాత ఖుష్బూ మానసికంగా కృంగిపోయినట్టు శ్యామల చెప్పారు. అటు తర్వాత అంటే 2000 సంవత్సరంలో దర్శకుడు సుందర్ సి ని పెళ్లి చేసుకుని కొత్త జీవితం స్టార్ట్ చేశారు. ఈ ఏడాది వచ్చిన ‘వారసుడు’ సినిమాలో నిజానికి ఖుష్బూ నటించాలి కానీ.. ఆ సినిమాలో ప్రభు కూడా నటించడంతో ఆమె తప్పుకుంది అని తమిళంలో ఎక్కువగా వార్తలు వచ్చాయి.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!