భారీ చిత్రంతో కమ్ బ్యాక్ ప్లాన్ చేస్తున్న సీనియర్ డైరెక్టర్

  • June 7, 2020 / 01:09 PM IST

మన టాలీవుడ్ లో ఉన్న సీనియర్ మోస్ట్ దర్శకులలో జయంత్ సి పరాన్జీ కూడా ఒకరు. ఒకప్పుడు టాప్ హీరోస్ అందరితో సినిమాలు తీసిన ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ మూవీ చేశారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో టక్కరి దొంగ లాంటి కౌ బాయ్ మూవీ చేశారు. ఇక బాలయ్యతో ఆయన చేసిన లక్ష్మీ నరసింహ మంచి విజయం సాధించింది. ఈ సీనియర్ దర్శకుడు జయంత్

నుంచి చివరగా 2017 లో ప్రముఖ పొలిటీషియన్ గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవితేజను హీరోగా పరిచయం చేస్తూ జయ్ దేవ్ అనే చిత్రం వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ మిగలడంతో ఆయనకు టాలీవుడ్ లో అవకాశాలు కనుమరుగయ్యాయి. ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించిన జయంత్ సి పరాన్జీ ఒక సాలిడ్ కంబ్యాక్ కోసం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఒక భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్టుకు గాను బాహుబలి,ఆర్ ఆర్ ఆర్ సృష్టికర్త విజయేంద్ర ప్రసాద్ గారు కథ అందిస్తున్నట్టు సమాచారం.

అలాగే ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామాలా ఉండబోతుంది అని తెలుస్తుంది. మరి ఇంకా దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుండగా ఓ స్టార్ హీరో కోసం చూస్తున్నాడట.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus