దేవకట్టా దర్శకత్వంలో రాజా హీరోగా రూపొందిన ‘వెన్నెల’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు కానీ టీవీల్లో బాగానే చూశారు. ఆ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పార్వతి మిల్టన్. ఆ సినిమా తర్వాత ఈమె ‘గేమ్’ ‘మధుమాసం’ వంటి సినిమాల్లో నటించింది. కానీ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘జల్సా’ తో ఈమె మంచి క్రేజ్ సంపాదించుకుంది.
అయితే ఆ తర్వాత ఎందుకో ఈమె ఎక్కువ సినిమాల్లో చేయలేకపోయింది. ‘దూకుడు’ లో స్పెషల్ సాంగ్ చేసింది… అది బాగా క్లిక్ అయ్యింది. కానీ ఎందుకో ఈమె ఎక్కువ సినిమాలు చేయలేదు.
ఇక అసలు విషయం ఏంటంటే.. పార్వతి మిల్టన్ సడన్ గా బేబీ బంప్ తో కనిపించి అందరికీ షాకిచ్చింది. దాదాపు 13 ఏళ్ళ నుండి ఈమె సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. 2012లో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్, శ్రీహరి కాంబినేషన్లో వచ్చిన ‘యమహో యమః’ సినిమా తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరమైంది. అదే ఏడాది ఈమె వ్యాపారవేత్త సంసు లాలనిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ కి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు.అయితే పార్వతి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూనే ఉంది. కానీ ఆమె లుక్ ఒకప్పటిలా లేకపోవడం ఆమెను ఫాలో అయ్యే వారికి షాక్ ఇస్తుంది. ఆమె బేబీ బంప్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :