సెలబ్రిటీల పెళ్లిళ్లు పెటాకులవ్వడం సర్వసాధారణం అయిపోయింది. కనీసం నెలకి ఒక సెలబ్రిటీ జంట తమ విడాకులకు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు. సెలబ్రిటీల పెళ్లిళ్లు పెటాకులవ్వడం సర్వసాధారణం అయిపోయింది. కనీసం నెలకి ఒక సెలబ్రిటీ జంట తమ విడాకులకు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు. మొన్ననే జయం రవి (Jayam Ravi) తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు రవి భార్య ఆర్తి కౌంటర్ ఇవ్వడంతో మరో రచ్చ మొదలైంది. ఇప్పుడు ఈ జాబితాలో సీనియర్ హీరోయిన్ ఊర్మిళ (Urmila Matondkar) కూడా చేరింది. తెలుగులో “గాయం, అంతం” లాంటి సినిమాలు చేసిన ఊర్మిళ హిందీలో “రంగీలా”తో భీభత్సమైన క్రేజ్ సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా (Heroine) ఎదిగింది.
Senior Heroine
2016లో మోషిన్ అక్తర్ ను వివాహం చేసుకొని సినిమాలకు స్వస్తి పలికింది. సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత భర్తతో విడాకులు కోరుతూ కోర్టులో అర్జీ పెట్టుకుంది. గత కొన్ని నెలలుగా ఊర్మిళ & మోషిన్ వేరు వేరు ఫ్లాట్స్ లో ఉంటున్నారు. కోర్టు త్వరలోనే వీరి విడాకులు ఖరారు చేసి, ఊర్మిళకు (Heroine) భరణం కూడా ఇప్పిస్తుందని వినికిడి. ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఇకపోతే.. ప్రస్తుతం 50 ఏళ్లకు కాస్త దగ్గరలో ఉన్న ఊర్మిళ మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని వినికిడి.
ఆల్రెడీ పొలిటికల్ గా ప్రయత్నించి విఫలమైన ఊర్మిళను ఓ పెద్ద ఫిలిం మేకర్ ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ రూపొందించే వెబ్ సిరీస్ కోసం అప్రోచ్ అయ్యాడని సమాచారం. ఈ కోర్టు కేసు ఓ కొలిక్కి వచ్చి వెంటనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుందని తెలుస్తోంది. మరి ఆమె రీఎంట్రీని తెలుగులో ఎవరు వినియోగించుకుంటారో చూడాలి. ఎందుకంటే.. ఆమె ప్రైమ్ టైమ్ లో ఉన్నప్పుడు ఆమెకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉండేది.