సీనియర్ నటి సుధ అందరికీ సుపరిచితమే. తమిళనాడు చెందిన వ్యక్తే అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు ఈమెను బాగా ఓన్ చేసుకున్నారు. తెలుగు సినిమాల్లో అక్క, వదిన, తల్లి, పాత్రలు అంటే ముందుగా ఈమెనే అందరికీ గుర్తొస్తుంటుంది. ఈమె చేస్తే ఆ పాత్రలకు నిండుతనం కూడా వస్తుంది అని భావించే దర్శకుల సంఖ్య కూడా ఎక్కువే.ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘ఆమె’ సినిమా ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ ‘రౌడీ అల్లుడు’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు.
‘మనసంతా నువ్వే’ ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘అతడు’ ‘పోకిరి’ ‘దూకుడు’ వంటి సినిమాలు కూడా ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఈ మధ్య కాలంలో సుధకి ఎక్కువ ఛాన్సులు రావడం లేదు. మొన్నామధ్య ‘లక్కీ భాస్కర్’ సినిమాలో ఈమె కనిపించింది. ఆ తర్వాత ఈమె పెద్దగా కనిపించలేదు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా ఆమె చెప్పిన హెల్త్ టిప్స్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.
అందులో సుధ మాట్లాడుతూ.. ‘ఎక్కువగా నేను వార్మ్ వాటర్ తాగుతాను. వార్మ్ వాటర్ మన బాడీలో ఉన్న ఫ్యాట్(కొవ్వు) ని కరిగిస్తుంది. అందుకే నేను ఎక్కువగా వార్మ్ వాటర్ తాగుతూ ఉంటాను. రోజుకి ఎంత కాదనుకున్నా నేను.. 5 నుండి 7 లీటర్ల నీళ్లు తాగుతాను. షూటింగ్ సెట్స్ లో నేను అలా నీళ్లు తాగుతూ ఉంటే అంతా షాక్ అవుతూ ఉంటారు. ‘బయట అంత ఎండగా ఉంది,పైగా చాలా వేడిగా ఉంది.. అయినా వేడి నీళ్లు ఎలా తాగుతున్నారు?’ అని చాలా మంది ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు. ఆది నాకు చిన్నప్పటి నుండి అలవాటే.61 ఏళ్ళు వచ్చినా ఆ అలవాటు పోలేదు. దానివల్ల నేను మరింత యాక్టివ్ గా ఉంటాను అనిపిస్తుంది. నేను నా హెల్త్ సీక్రెట్ అంటే అదే. మన ఆరోగ్యం మన బాధ్యత. దాని విషయంలో జాగ్రత్త తీసుకుంటే.. మనకు మిగిలిన విషయాల్లో టెన్షన్ ఉండదు. అప్పుడు మనకు మనం అందంగా కనిపిస్తాము.. మిగతా వాళ్ళకి కూడా అలాగే కనిపిస్తాము’ అంటూ అసలు విషయాన్ని బయట పెట్టింది.