Shah Rukh Khan: ఒక్క సినిమా చేయండి మణిరత్నంను రిక్వెస్ట్ చేసిన షారుక్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు షారుఖ్ ఖాన్ ఒకరు. ఈయన హీరోగా ఎన్నో సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు. ఇక గత ఏడాది ఏకంగా మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి షారుఖ్ ఖాన్ ఇటీవల ఒక అవార్డు వేడుకలో పాల్గొన్నారు. అవార్డు కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ నాతో ఒక సినిమా చేయండి ప్లీజ్ అంటూ డైరెక్టర్ ని వేడుకున్నారు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో మణిరత్నం గురించి చెప్పాల్సిన పనిలేదు.షారుక్ ఖాన్ మణిరత్నం కాంబినేషన్లో దిల్ సే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా తర్వాత తిరిగి వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమాలు రాలేదు. ఈ క్రమంలోనే ఓ అవార్డు వేడుకలో వీరిద్దరూ పాల్గొని సందడి చేశారు.

ఈ అవార్డు కార్యక్రమంలో భాగంగా మణిరత్నంని డైరెక్ట్ గా (Shah Rukh Khan) షారుక్ ఖాన్ నాతో ఒక సినిమా చేయండి అంటూ బహిరంగంగానే అడిగేసారు. బెగ్ చేస్తున్నా.. రిక్వెస్ట్ చేస్తున్నా.. ప్రతీసారి అడుగుతున్నా నాతో సినిమా చేయమని.. ఓపెన్‌గా అడుగుతున్నా నాతో సినిమా ఎప్పుడు చేస్తారని? అంటూ షారుఖ్ వేదికపై నుండి మణిరత్నాన్ని అడిగారు. ఇలా డైరెక్టర్ తో సినిమా చేయమని అడగడమే కాకుండా ఈసారి విమానంపై కూడా నేను డాన్స్ చేస్తాను అంటూ షారుక్ ఖాన్ చెప్పారు.

నువ్వు విమానం కొన్న తర్వాత చేద్దాం అంటూ మణిరత్నం చెప్పగా అది ఎంతో దూరం లేదు అంటూ షారుక్ ఖాన్ మాట్లాడారు. విమానం కిందకు దించుతాను అని మణిరత్నం అనగానే నేను వస్తున్నా.. వస్తున్నా అంటూ షారుక్ ఖాన్ నవ్వులు పూజించారు. మరి షారుక్ అంతలా రిక్వెస్ట్ చేస్తున్నందుకైనా మణిరత్నం తనతో సినిమా చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది ప్రస్తుతం మనిరత్నం కమల్ హాసన్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus