భారీ అంచనాల నడుమ ఇండస్ట్రీ లాంచ్ కానున్న స్టార్ హీరో వారసుడు?

  • October 4, 2022 / 12:48 PM IST

సాధారణంగా ఇండస్ట్రీలో హీరోల వారసులు అనంతరం హీరోలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది వారసులు వారసురాలు ఇండస్ట్రీలో అగ్రతారాలుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మరొక స్టార్ హీరో వారసుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.బాలీవుడ్ కింగ్ కాంగ్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ వెండితెర ఎంట్రీ కి సిద్ధమయ్యారని సమాచారం. ఆర్యన్ ఖాన్ రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర.

ఈ సినిమా పార్ట్ 2 ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై షారుఖ్ ఖాన్ లేదా బ్రహ్మాస్త్ర చిత్ర బృందం ఇంతవరకు ఏమాత్రం స్పందించలేదు.అయితే షారుఖ్ అభిమానులు మాత్రం ఆర్యన్ ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలియడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్యన్ ఖాన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాకి రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే రెండవ భాగంలో ఆర్యన్ ఖాన్ నటించబోతున్నారని సమాచారం. అయితే త్వరలోనే ఈ వార్తలపై స్పష్టత రానుంది. ఇకపోతే ఆర్యన్ ఖాన్ సినిమాలలోకి రాకముందే గత ఏడాది క్రూయిజర్ రేవ్ పార్టీలో అధికారులు ఈయనని అరెస్టు చేయడంతో గత కొద్ది రోజులుగా ఆర్యన్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అయితే ఆర్యన్ ఖాన్ కి డ్రగ్స్ కి ఏమాత్రం సంబంధం లేదని విచారణలో తేలడంతో ఈయనకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus