జయప్రద కోసం పడి చచ్చేవాడంట!!
- February 27, 2017 / 11:57 AM ISTByFilmy Focus
జయప్రద అందాలను ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు. ఆమె పేరు విన్నా, ఆమెను తల్చుకున్నా.. “రసోద్వేగానికి” లోనయ్యేవాళ్ళు కోట్లల్లో ఉంటారు.ఆమె నటించిన సినిమాలను.. సినిమాల్లోని పాటలను ఇప్పటికీ ప్రతి రోజు తక్కువలో తక్కువ పది పదిహేను లక్షల మంది చూస్తుంటారు.
ఆరు పదులకు చేరువవుతున్నా.. ఆమె అందం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ముఖ్యంగా.. అప్పట్లో ఆమె కోసం అర్రులు చాచే.. పడిచచ్చే ప్రముఖులు పుంఖానుపుంఖాలుగా ఉండేవాళ్ళు.వాళ్ళల్లో తానూ ఒకడినని చెబుతున్నారు ప్రముఖ కథానాయకుడు షారుక్ ఖాన్. తన యవ్వనమంతా జయప్రద తలపులతోనే గడిచిపోయిందని ఈ బాలీవుడ్ బాద్ షా ప్రకటించేశాడు.యాష్ చోప్రా మెమోరియల్ అవార్డు గ్రహీత హోదాలో సదరు వేదికపై మాటాడిన షారుక్.. ఆ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన జయప్రద గురించి అలా మాటాడాడు!!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












