Shakalaka Shankar: హీరో రవితేజకు క్షమాపణలు చెప్పిన షకలక శంకర్.. ఏమైందంటే?

జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న షకలక శంకర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు అయితే గత కొద్దిరోజుల క్రితం ఈయన ఒక హీరోని నిర్మాతను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నేటిజన్స్ షకలక శంకర్ ను తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడంతో షకలక శంకర్ చివరికి సోషల్ మీడియా వేదికగా నటుడు రవితేజకు క్షమాపణలు తెలియజేశారు. అయితే ఈయన రవితేజకు క్షమాపణలు చెప్పడానికి గల కారణమేంటి అనే విషయానికి వస్తే…

రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా తాజాగా విడుదలై ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ కొందరు అదృష్టం ఉండి రెండు మూడేళ్లకే మెగాస్టార్లు సూపర్ స్టార్లు అవుతారు కానీ రవితేజ చాలా కష్టపడి పైకి వచ్చారు అంటూ కామెంట్లు చేశారు.

ఇలా బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై షకలక శంకర్ రాజయోగం సినిమా థ్యాంక్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ…ఒక ప్రొడ్యూసర్ అదృష్టం ఉంటేనే సూపర్ స్టార్లు మెగాస్టార్లు అవుతారు అని కామెంట్లు చేశారు. అయితే ఇలా స్టార్లు కావడం అంత సులభం కాదు రాత్రి పగలు ఎంతో కష్టపడాలి నీ ముందు ఎవడో హీరో ఉన్నాడని వాడు ఉబ్బి పోవాలని ఇలా మాట్లాడటం సరికాదంటూ షకలక శంకర్ బండ్ల గణేష్ వాక్యలకు కౌంటర్ ఇచ్చాడు.

అయితే షకలక శంకర్ నీ ముందు ఎవడో హీరో, వాడు అంటూ హీరోని ఉద్దేశించి మాట్లాడారు అయితే బండ్ల గణేష్ ముందున్న హీరో రవితేజ.దీంతో రవితేజను ఎవడో, వాడు అనడంతో మండిపోయిన అభిమానులు భారీగా షకలక శంకర్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో చేసేదేమీ లేక శంకర్ సోషల్ మీడియా వేదికగా నోరు జారాను వీలైతే నన్ను క్షమించండి రవితేజ గారు అంటూ క్షమాపణలు చెప్పారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus