మలయాళ శృంగార చిత్రాల ద్వారా షకీలా బాగా పాపులర్ అయ్యారు. స్టార్ హీరోలు సినిమాలు సైతం షకీలా చిత్రాలకు పోటీ పడలేక వాయిదా పడ్డాయంటేనే.. ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్ధమవుతోంది. ఇప్పుడు ఆమె జీవితంపై బాలీవుడ్ లో బయోపిక్ తీస్తున్నారు. షకీలాగా బాలీవుడ్ నటి రిచా చద్దా నటించనున్నారు. ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీలా అనేక ఆసక్తికర విషయాలను చెప్పారు. “సినిమాల్లో హీరోలకు, హీరోయిన్లకు డూప్‌లను ఉపయోగిస్తారని తెలుసు. కానీ నగ్నంగా నటించడానికి ఒప్పుకోని హీరోయిన్లకు డూప్‌లను ఉపయోగించి న్యూడ్‌గా చూపుతారని నాకు తెలియదు. నా విషయంలో అదే జరిగింది.
నేను లేకుండానే ఓ సీన్లో మరో మహిళను డూప్‌గా ఉపయోగించి నేను నగ్నంగా నటించినట్టు చూపించారు. థియేటర్లకు వెళ్లి నా సినిమాలు చూడలేకపోయేదానిని. అందువల్ల నా సినిమాలలో నేను ఎలా ఉంటాను అనే విషయాన్ని తెలుసుకోలేకపోయాను.” అని వివరించింది. ఇక డైరక్టర్లు కథ ఒకటి చెబుతారని.. షూటింగ్ మరోలా చేస్తారని వెల్లడించారు. “సినిమా షూటింగ్లో సీన్ ఒకటి చెబుతారు. కానీ షూట్ చేసేటప్పుడు నా వక్షోజాలపై, పిరుదులపై కెమెరా పెడుతారు. ఆ సమయంలో నేను ఏమీ చెయడానికి ఉండదు. పైకి శ్రీరంగనీతులు చెబుతారు. చేసేది మాత్రం మరోలా ఉంటుంది” అని షకీలా ఆరోపణలు చేశారు.