కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలు ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్… ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టవు. అతను చేసింది కొన్ని సినిమాలైనా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించారు. శేఖర్ సొంత నిర్మాణంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తీసారు. దీంతో హ్యాపీ డేస్ తిరిగి వస్తాయి అనుకున్నారు. కానీ ఆ సినిమా బ్యాడ్ డేస్ ని మిగిల్చింది. తర్వాత అనామిక కూడా హెల్ప్ చేయలేక పోయింది. ఇక తీవ్రంగా ఆలోచించి మెగా హీరోలకు కథ రెడీ చేశారు. ఆ కథను వరుణ్ తేజ్ ఓకే చేశాడు.
వరుణ్ ఇప్పుడు డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత వరుణ్ ను తన స్టైల్ లో చూపించడానికి మెగా ఫోన్ పట్టుకుంటారు ఈ లీడర్. మిస్టర్, శేఖర్ కలిసి మ్యాజిక్ చేయనున్నచిత్రానికి దిల్ రాజు నిర్మాత.