Bigg Boss 7 Telugu: ప్రిన్స్ చేసిన పనికి ఫ్రస్టేషన్ లో సిగరెట్స్ తాగేసిన షకీల.. అసలు ఏం జరిగిందంటే?

  • September 5, 2023 / 11:50 AM IST

బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం నామినేషన్స్ హౌస్ మేట్స్ మద్యలో చిచ్చుని రగిలించాయి. ముఖ్యంగా షకీల బాగా ఫ్రస్టేషన్ కి గురి అయ్యింది. తను ప్రిన్స్ యవార్ ని నామినేట్ చేసింది. అయితే, ప్రిన్స్ ఆమె చెప్పిన రీజన్ ని యాక్సెప్ట్ చేయలేదు. హౌస్ లోకి వచ్చినపుడు పేరు ప్రిన్స్ అని చెప్తే, మీ నాన్న కింగ్ కదా అని అడిగినపుడు తను యస్ అంటూ యాటిట్యూడ్ చూపించాడని ఈ రీజన్ ఎవరైనా చెప్తారా అని ప్రిన్స్ యవార్ మిగతా హౌస్ మేట్స్ తో మొత్తుకున్నాడు.

ఇక తన నామినేషన్స్ ముగించుకున్న తర్వాత షకీలా దమ్ముకొట్టేందుకు స్మోకింగ్ జోన్ లోకి ఫుల్ సిగరెట్ ప్యాకెట్ తీస్కుని మరీ వెళ్లింది. మొదటి వారం నామినేషన్స్ లో శోభాశెట్టి, సందీప్, ప్రిన్స్, ప్రియాంక , రతిక, కిరణ్ రాథోడ్, షకీల ఇలా అందరూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాళ్లు చెప్పిన రీజన్స్ ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇలా మొదటి వారమే హౌస్ మేట్స్ మద్యలో అగ్గి రాజుకుంది. ఒకరి నామినేషన్స్ రీజన్స్ మరొకరికి నచ్చడం లేదు.

అంతేకాదు, అసలు బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) చెప్పిన నామినేషన్ కాన్సెప్ట్ కూడా అర్ధం కాలేదు చాలామందికి. ఈసారి మొదటి వారం నామినేషన్స్ లో ఏకంగా 8మంది నామినేట్ అయ్యారు. వీళ్లలో ముగ్గురు మేల్ కంటెస్టెంట్స్ ఐదుగురు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. మరి మొదటి వారం ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus