‘ప్రత్యర్థి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్న శంకర్ ముడావత్

Advertisement

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ల సినిమాలకు ఎప్పుడూ జనాల్లో ఆదరణ ఉంటుంది. సరైన కథ, కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ ప్లేతో సినిమాలు తీస్తే జనాలు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారు. అయితే ఇప్పుడు ఇలాంటి జానర్లోనే ప్రత్యర్థి సినిమా రాబోతోంది. జనవరి 6న రాబోతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ మధ్యే విడుదల చేశారు. ప్రత్యర్థి ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ మూవీతోనే శంకర్ ముడావత్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

ఎన్నో ఏళ్ల నుంచి పరిశ్రమలో ఉన్న శంకర్ ముడావత్.. అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టు సంపాదించుకున్నారు. దేవాకట్ట తెరకెక్కించిన ఆటో నగర్ సూర్య సినిమాకు సినిమాటోగ్రఫర్‌గా పని చేసిన శ్రీకాంత్‌ నరోజ్ వద్ద అసిస్టెంట్‌ కెమెరామెన్‌గానూ చేశారు. ఇలా ఇప్పుడు ప్రత్యర్థి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు దర్శకుడిగా రాబోతున్నారు.

ఇప్పటికే ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలోని ప్రముఖ వ్యక్తులకు ప్రత్యేకంగా ప్రదర్శించి చూపించారు. సినిమా బాగుందని, కొత్త దర్శకుడైనా సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేట్టుగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను నిర్మాత సంజయ్ సాహ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus