సినీ పరిశ్రమ అంటే రంగుల ప్రపంచం అని అంతా అనుకుంటారు. ముఖ్యంగా స్టార్స్ లైఫ్ అంటే పూర్తిగా లగ్జరీలతో కూడుకుని ఉంటుంది అనుకుంటారు. కానీ వాళ్ళు కూడా నిత్యం ప్రమాదాలతో సహవాసం చేస్తారు… చావు అంచుల దాకా వెళ్లి పలకరించి వస్తారు అని చాలా మందికి తెలీదు. షూటింగ్లో భాగంగా వాళ్లకు తీవ్ర గాయాలు అవుతాయి. కిందా మీదా పడి షూటింగ్ కంప్లీట్ చేయాలి. వాటికి ప్రమోషన్లు చెయ్యాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత సర్జెరీలు చేయించుకుని రిలాక్స్ అవ్వాలి.
మనలాగా దెబ్బ తగిలిన వెంటనే వాళ్ళు చికిత్స చేయించుకుంటారు అని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు కనుక వెనకడుగు వేస్తే నిర్మాత కోట్లు నష్టపోవాల్సి ఉంటుంది. ప్రభాస్ ఎన్నిసార్లు చేతులు, కాళ్ళు విరక్కొట్టుకుంటే ‘బాహుబలి'(సిరీస్) తయారయ్యిందో ఎవ్వరికీ తెలీదు. మహేష్ బాబు కాలు విరక్కొటుకుంటే ‘స్పైడర్’ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ అయితే 10 సినిమాల షూటింగ్లల టైంలో దెబ్బలు తిన్నాడు. రాంచరణ్ ప్రాణాలు పణంగా పెడితే ‘రచ్చ’ తయారయ్యింది. వీళ్ళలానే శర్వానంద్ కూడా ఓ సినిమా కోసం ఏకంగా విమానం నుండి దూకేశాడట.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శర్వానంద్ మాట్లాడుతూ.. ” ‘జాను’ సినిమా షూటింగ్ టైంలో… ‘లైఫ్ ఆఫ్ రామ్’ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. అందులో భాగంగా స్కై డైవింగ్ చేయాల్సి ఉంది. దాని కోసం ప్రాక్టీస్ కూడా చేశాను. 15000 అడుగుల ఎత్తులో విమానం ఉన్నప్పుడు దూకాను. కానీ పారాచూట్ టైంకి తెరుచుకోలేదు. దీంతో నేను కిందపడిపోయాను.
నా చేతికి రెండు ప్లేట్ లు, కాలుకి ఒక ప్లేట్ వేశారు. కోలుకోడానికి నాకు రెండున్నరేళ్ళు టైం పట్టింది” అంటూ చెప్పి అందరికీ షాకిచ్చాడు శర్వానంద్. అయితే అతను అంత కష్టపడినా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద గట్టెక్కలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ అయిన ’96’ కు రీమేక్ గా తెరకెక్కింది.
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!