Sharwanand: ఆ విషయంలో శర్వానంద్ రూటు మార్చాల్సిందేనా?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన శర్వానంద్ టైమ్ అస్సలు బాగా లేదు. శర్వానంద్ హీరోగా నటించి యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా మిగులుతున్నాయి. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు యావరేజ్ టాక్ రాగా క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం సినిమా బాగుందని కామెంట్లు చేస్తున్నారు.

Click Here To Watch Now

శతమానం భవతి, మహానుభావుడు సినిమాల తర్వాత శర్వానంద్ కు వరుస షాకులు తగులుతున్నాయి. జాను, శ్రీకారం సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాలు కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి. అయితే శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాలలో ఆఫర్లను కోల్పోయారని సమాచారం అందుతోంది. అయితే శర్వానంద్ రెమ్యునరేషన్ మాత్రం తగ్గలేదని ఒక్కో సినిమాకు ఈ హీరో 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని బోగట్టా. శర్వానంద్ తర్వాత సినిమాలతో అయినా సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది.

శర్వానంద్ కథల విషయంలో రూటు మార్చాలని నవ్యత ఉన్న కథలకు ఓటేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై కృష్ణచైతన్య డైరెక్షన్ లో ఒక సినిమాలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక సినిమాలో శర్వానంద్ నటించనున్నారని సమాచారం అందుతోంది. ఈ రెండు సినిమాల ఫలితాలపైనే శర్వానంద్ కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు. కెరీర్ విషయంలో శర్వానంద్ ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ హీరోగా తెరకెక్కే సినిమాకు రాజు సుందరం దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. అయితే వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా శర్వానంద్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. ఇతర హీరోలు వరుస సక్సెస్ లతో కెరీర్ ను కొనసాగిస్తుంటే శర్వానంద్ మాత్రం ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఢీలా పడుతుండటం గమనార్హం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus