రాజ్ తరుణ్ ఫై వచ్చిన వార్తలు నిజమయ్యాయి. ఫిలిం మేకింగ్ లో అతిగా ఇన్వాల్వ్ అవుతున్నాడనే విషయం నిర్ధారణ అయ్యింది. సతీష్ వేగాస్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నశతమానం భవతి చిత్రానికి మొదట రాజ్ తరుణ్ ని హీరోగా అనుకున్నారు.
అతన్ని తొలగించి శర్వానంద్ ను హీరోగా తీసుకున్నట్లు బుధ వారం అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా త్వరలో సెట్స్ ఫై కి వెళ్లనున్నట్లు చిత్ర యూనిట తెలిపింది. రాజ్ తరుణ్ డైరక్టర్ వేషాలు తగ్గించుకోకుంటే సినిమా అవకాశాలు తగ్గిపోతాయని సినీ పండితులు హెచ్చరిస్తున్నారు.