శర్వానంద్ కి కెరీర్ బెస్ట్ బంపర్ ఆఫర్!

నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలెట్టిన “ఎన్టీఆర్” బయోపిక్ కి ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. తోలుదా కథ సెట్ అవ్వక కొన్నాళ్లపాటు ఆగాల్సి వస్తే.. ఆ తర్వాత దర్శకుడు తేజ వైదొలగడంతో ప్రొజెక్ట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే.. బాలకృష్ణ రంగంలోకి దిగి డైరెక్టర్ గా క్రిష్ ను టీం లోకి తీసుకొచ్చేసరికి అన్నీ మెలమెల్లగా సెట్ అవుతూ వచ్చాయి. స్క్రిప్ట్ వర్క్ అండ్ ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా ఊపందుకొంది. ఆల్రెడీ విద్యాబాలన్ కి బసవతారకం వెర్షన్ ను ఎక్స్ ప్లేన్ చేయడం కూడా జరిగిపోయిందట.

ఇకపోతే.. ఇవాళ తెలిసిన కొత్త విషయం ఏంటంటే ఈ బయోపిక్ లో శర్వానంద్ కూడా భాగం కానున్నాడు. ఎవరి పాత్ర పోషిస్తున్నాడో తెలిస్తే ఆల్మోస్ట్ షాక్ అయిపోతారు. యుక్త వయసులో ఎన్టీయార్ గా శర్వానంద్ నటించబోతున్నాడట. చాలా లిమిటెడ్ సీన్స్ ఉండే సదరు పాత్ర కోసం శర్వానంద్ ఇంకాస్త సన్నబడబోతున్నాడట. తనకు “గమ్యం” లాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన క్రిష్ అడగడంతో ఈ సినిమాలో నటిస్తున్నాడట శర్వానంద్. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో షూట్ కి వెళ్లనున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ శర్వానంద్ తోనే మొదలవుతుందని సమాచారం. ఈలోపు బాలకృష్ణ తాను వినాయక్ తో కమిట్ అయిన షూటింగ్ కొంచెం కంప్లీట్ చేసుకొని “ఎన్టీఆర్” బయోపిక్ లో జాయినవుతాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus