Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » స్టార్ హీరో శ‌ర్వానంద్ చేతుల మీదుగా చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ రూపొందించిన‌ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ టీజ‌ర్ విడుద‌ల‌

స్టార్ హీరో శ‌ర్వానంద్ చేతుల మీదుగా చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ రూపొందించిన‌ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ టీజ‌ర్ విడుద‌ల‌

  • January 23, 2026 / 06:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరో శ‌ర్వానంద్ చేతుల మీదుగా చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ రూపొందించిన‌ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ టీజ‌ర్ విడుద‌ల‌

ఒక రోజు జ‌రిగిన అనుకోని ఓ ఘ‌ట‌న‌తో 6 వ్య‌క్తుల జీవితాల్లో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయనే వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’(Baa Baa Black Sheep). దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, క‌శ్య‌ప్‌, రాజారవీంద్ర‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శుక్ర‌వారం ఈ సినిమా టీజ‌ర్‌ను ప్రముఖ స్టార్‌ హీరో శ‌ర్వానంద్ విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.

టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. చుట్టూ ప‌చ్చ‌ద‌నం, కొండ‌లున్న అంద‌మైన ఊరిని చూపిస్తారు. ‘చెప్పుకోడానికి ఇది మామూలు క‌థ కాదు. అండ పిండ బ్ర‌హ్మాండాల‌ను కూడా అల్లాడించే క‌థ’ అనే డైలాగ్ వినిపిస్తే , దానికి త‌గ్గ‌ట్లుగా ‘ఏం చెప్పాల‌నుకుంటున్నారో కాస్త క్లారిటీగా చెప్ప‌వా’ అనే మ‌రో డైలాగ్ వినిపిస్తుంది. ఈ గ్యాప్‌లో కొన్ని సీన్స్‌ కొంత మంది గ‌న్స్‌తో క‌నిపిస్తారు. సినిమా ప్ర‌ధాన పాత్ర‌ధారుల్లో ఒక‌రైన అక్ష‌య్ ఈవెంట్‌లో చెఫ్ లుక్‌లో క‌నిపిస్తాడు. అప్పుడే మ‌న‌కు మ‌రో మెయిన్ క్యారెక్ట‌ర్ విష్ణు ఎంట్రీ క‌నిపిస్తుంది. విష్ణు ద‌గ్గ‌ర‌కెళ్లి ఈవెనింగ్ మంచి స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేశా మామ అని అంటాడు.

గ‌న్ ఫైరింగ్‌, కార్ చేజింగ్ వంటి ఎంగేజింగ్ సీన్స్ ను చూపిస్తారు. విష్ణు మాట్లాడుతూ ‘పోలీసులు మ‌న వెంట ఎందుకొస్తున్నారా?..వాళ్ల‌ని కూడా ఇన్వైట్ చేశావా?’ అని టెన్ష‌న్ ప‌డుతుంటాడు. ఈ క్ర‌మంలోనే జాన్ షెల్లీ హిట్లర్ అనే డాన్‌ పాత్ర‌లో ఉపేంద్ర లిమాయే ఎంట్రీ ఉంటుంది. త‌ను పెళ్లిలోకి వ‌చ్చి అక్ష‌య్‌, విష్ణుల‌ను కొట్టి ‘మీరు దొబ్బేసిన బాక్స్ అండ్ గ‌న్ ఎక్క‌డ‌.. నా ద‌గ్గ‌ర కొట్టేసిన బాక్స్ ఎవ‌రికి అమ్మేశారు?’ అని అడుగుతాడు. అక్క‌డ నుంచి టినూ ఆనంద్‌, జార్జ్ మ‌రియ‌న్‌, రాజా ర‌వీంద్ర, విస్మ‌య శ్రీ త‌దిత‌రులకు సంబంధించిన పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు.

టీజ‌ర్ చూస్తుంటే…డిఫ‌రెంట్ కామెడీ, బ్యూటీఫుల్ లోకేష‌న్స్‌లో ‘బా బా బ్లాక్ షీప్‌’ చిత్రాన్ని రూపొందించార‌ని టీజ‌ర్‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. మూవీ ఓ బాక్స్‌, గ‌న్ చుట్టూ తిరిగుతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ఇంత‌కీ ఆ గ‌న్ కోసం మాఫియా డాన్ ఎందుకు వెతుకుతుంటాడు. చివ‌ర‌కు ఆ బాక్స్ ఎవ‌రి ద‌గ్గ‌ర ఉంటుంది.. ఆ బాక్స్‌లో ఏముంటుంద‌నే విష‌యాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు నిర్మాత వేణు దోనేపూడి.

ఈ సంద‌ర్భంగా వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘‘సినిమా మొత్తాన్ని మేఘాల‌యా రాష్ట్రంలో లోనే పూర్తి చేశాం. చిరపుంజి వంటి అద్భుత‌మైన లొకేష‌న్స్‌లోనూ చిత్రీక‌రించాం. మేఘాల‌యాలో మొత్తం సినిమా షూటింగ్ జ‌రుపుకున్న తొలి సినిమా ‘బా బా బ్లాక్ షీప్‌’. అతి త‌క్కువ రోజుల్లోనే ప‌క్కా ప్లానింగ్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. మా డైరెక్ట‌ర్ గుణి, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు స‌హా ఎంటైర్ టీమ్‌ స‌హకారంతో ఇది సాధ్య‌మైంది. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌రలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

అజయ్ అబ్రహం జార్జ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేయ‌గా, స్టీఫెన్, ఆనంద్ సంగీతాన్ని స‌మ‌కూర్చారు.

నటీనటులు :
టిను ఆనంద్, ఉపేంద్ర , జార్జ్ మరియన్, అక్షయ్, కార్తికేయ, అభినవ్, హర్ష, కిషోర్ కృష్ణ, విస్మయశ్రీ, మాళవి, సమృద్ధి, విష్ణు ఓయ్, క‌శ్య‌ప్‌, రాజా ర‌వీంద్ర‌, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, అనీష్ కురివిల్లా, కాదంబరి కిరణ్ తదితరులు

సాంకేతిక బృందం :

బ్యానర్ : చిత్రాలయం స్టూడియోస్
నిర్మాత : వేణు దోనేపూడి
దర్శకత్వం : గుణి మంచికంటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: శ‌్వేత దోనేపూడి
సంగీతం : స్టీఫెన్, ఆనంద్
ఆర్ట్ : సాహి సురేష్
ఎడిటింగ్ : విజయ్ ముక్తవరపు
కెమెరామెన్ : అజయ్ అబ్రహం జార్జ్
కో డైెరెక్టర్ : కిషోర్
కాస్ట్యూమ్స్ : ప్రియాంక
కొరియోగ్రఫీ : జెడి. మాస్టర్
యాక్షన్స్ : వింగ్ చున్ అంజి
పి.ఆర్.ఒ : మోహన్ తుమ్మల

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav
  • #Akshay
  • #Baa Baa Black Sheep
  • #George Marian
  • #Harsha

Also Read

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

related news

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

trending news

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

17 mins ago
Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

25 mins ago
Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

55 mins ago
Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

3 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

4 hours ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

5 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

7 hours ago
Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version