శర్వానంద్ ‘శ్రీకారం’ ఏప్రిల్ 24 విడుదల

యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం దీని షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.ఇటీవల చిత్ర బృందం ఆవిష్కరించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు చాలా మంచి స్పందన వచ్చింది. తాజాగా నిర్మాతలు సినిమా విడుదల తేదీ ప్రకటించారు. ఏప్రిల్ 24న ‘శ్రీకారం’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాల విడుదలకు సమ్మర్ అతి పెద్ద సీజన్ అనే విషయం తెలిసిందే. ‘శ్రీకారం’తో సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకోవడానికి శర్వానంద్ రెడీ అవుతున్నారు. కిషోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో శర్వానంద్ జోడీగా ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీని నిర్మిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వాళ్లకు ఇది రెండో చిత్రం. ‘గద్దలకొండ గణేష్’ మూవీతో మాస్ ట్యూన్స్ కూడా ఇస్తానని నిరూపించుకొని మంచి ఫామ్ లో ఉన్న మిక్కీ జె మేయర్ ‘శ్రీకారం’కు వినసొంపైన బాణీలు అందిస్తున్నారు. పేరుపొందిన రైటర్ సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తుండగా, జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus