పొడుగు కాళ్ళ సుందరి శిల్పాశెట్టి.. టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే..! కాబట్టి ఆమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే అతని భర్త రాజ్ కుంద్రా గత రెండు రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఇతను తన భార్యకు వేరే అతనితో ఎఫైర్ ఉందంటూ సంచలన కామెంట్లు చేశారు. అయితే అతను కామెంట్స్ చేసింది శిల్పా శెట్టి గురించి కాదు..అతని మొదటి భార్య గురించి. రాజ్ కుంద్రా తన మొదటి భార్య నుండి విడిపోయిన తర్వాత శిల్పా శెట్టి ని 2009 లో రెండో పెళ్లి చేసుకున్నారు.
అయితే 12 ఏళ్ళ తర్వాత రాజ్ కుంద్రా మొదటి భార్య..శిల్పా శెట్టి వలనే తన భర్తకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో రాజ్ కుంద్రా.. ‘నా మొదటి భార్య నా సొంత చెల్లెలు భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అది తెలిసిన తర్వాతే.. నేను ఆమె నుండి విడిపోయాను. ఇన్నేళ్లలో ఈ విషయం ఎక్కడా చెప్పలేదు, ఫ్యామిలీని అల్లరి చేసుకోకూడదని సైలెంట్ గా ఉంటూ వచ్చాను.
కానీ ఆమె నన్ను రివర్స్ లో టార్గెట్ చేసి ట్రిక్స్ ప్లే చేస్తుంది అందుకే ఇప్పుడు ఓపెన్ అయ్యాను. ఈ విషయంలో శిల్పా శెట్టి తప్పు లేదు అంటూ రాజ్’ తెలిపాడు. ఇక ఈ విషయం పై శిల్పా శెట్టి మాట్లాడుతూ.. ‘నా భర్త చాలా మంచోడు.. మంచోడికి కోపం వస్తే ఇలానే ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.