Shilpa Shetty: పుట్టినరోజు సందర్భంగా తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకున్న శిల్పాశెట్టి!

  • June 9, 2022 / 07:32 PM IST

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఎంతో ఖరీదైన అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి వ్యానిటీ వ్యాన్ కొనుగోలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. షూటింగ్ వెళ్ళినప్పుడు వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను ఇందులో ఏర్పాటు చేసుకుని దూరప్రాంతాలకు షూటింగులకు వెళుతుంటారు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క సెలబ్రిటీ దగ్గర ఎంతో ఖరీదైన విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన వ్యానిటీ వ్యాన్ ఉన్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ అగ్రతార శిల్పాశెట్టి సైతం తన పుట్టినరోజు సందర్భంగా తనకు తానే గిఫ్ట్ గా ఖరీదైన లగ్జరీ వ్యానిటీ వ్యాన్ కొనుగోలు చేశారు.

జూన్ 8వ తేదీ ఈమె పుట్టిన రోజు జరుపుకోవడంతో పుట్టిన రోజు సందర్భంగా తన వ్యానిటీ వ్యాన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అన్ని సౌకర్యాలతో ఎంతో లగ్జరీగా ఫైవ్ స్టార్ హోటల్ ను తలపించేలా ఉన్నటువంటి ఈమె వాహనానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతో ప్రత్యేకంగా తనకు అనుగుణంగా ఈ వ్యానిటీ వ్యాన్ లో కిచెన్‌, హెయిర్‌ వాష్‌ రూమ్‌, యోగా డెక్‌ సహా అన్ని సదుపాయాలను అమర్చుకుంది.

ఫిట్నెస్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చే శిల్పాశెట్టి ప్రయాణ సమయంలో తన సమయం వృధా కాకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా యోగా డెక్ తయారు చేయించారు. ఇలా ఎంతో విలాసవంతమైన అన్ని సౌకర్యాలతో కూడిన ఈ వాహనం నలుపు రంగులో ఉండి ఈ వాహనానికి ముందు ఎస్‌ఎస్‌కే అనే అక్షరాలు ఉన్నాయి. ఈమె సినిమాల విషయానికి వస్తే.. తన భర్త రాజ్ కుంద్రా ఫోర్న్ కంటెంట్ వీడియోలు తీస్తున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే.

ఇలా తన గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో అరెస్ట్ అయిన కుంద్రా బెయిల్ పై బయటికి వచ్చారు.ఈ తరుణంలో కొద్దిరోజుల పాటు ఈమె ఏలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈమె నికమ్మ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా జూన్‌ 17న రిలీజవుతోంది. అలాగే రోహిత్‌ శెట్టి ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ అనే వెబ్‌ సిరీస్‌తో త్వరలో ఓటీటీలో ప్రసారం కానుంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus