పొడుగు కాళ్ళ సుందరి శిల్పా శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన ‘వీడెవడండీ బాబు’ , నాగార్జున ‘ఆజాద్’, బాలకృష్ణ ‘భలే వాడివి బాసూ’ వంటి సినిమాల్లో నటించింది. ఈమె వయసు ఇప్పుడు 50 ఏళ్ళు. అయినప్పటికీ ఆమె లుక్ 20 ఏళ్ల అమ్మాయిల మాదిరి ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. మొత్తానికి తన ఫిట్నెస్ సీక్రెట్ ను బయట పెట్టింది శిల్పా శెట్టి.
శిల్పా ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తీసుకుంటుందట. అనంతరం తులసి ఆకులు, బెల్లం, అల్లంను కలబంద రసంలో వేసుకుని స్పూన్ తో కలుపుకుని తాగుతుందట. ఫైబర్ పుష్కలంగా ఉండే ఫుడ్ లేదా ముస్లీ, తాజా పండ్లు లేదా ఓట్స్ వంటివి ఈమె డైట్ లో ఉండేలా చూసుకుంటుందని తెలుస్తుంది. షుగర్కు మాత్రం దూరంగా ఉంటుందట. ఒకవేళ క్రేవింగ్స్ ఆగకపోతే తేనే, బెల్లం వంటి వాటిని తీసుకుంటుందని తెలుస్తుంది. శిల్పా శెట్టి సాధారణంగా లంచ్ ను 12 గంటల నుండి 1 గంట కి పూర్తయ్యేలా చూసుకుంటుందట.
ప్రోటీన్ కోసం ఫిష్, చికెన్… ఆకు కూరలు, పప్పు వంటివి తీసుకోవడానికి ఇష్టపడుతుందట. ఇక డిన్నర్ విషయానికి వచ్చేసరికి ఓట్స్ లేదా సలాడ్స్ ను తీసుకుంటుందట. డిన్నర్ ను సాయంత్రం 7:30 లోపు ఫినిష్ అయ్యేలా చూసుకుంటుందట. అందుకే ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఏ టైంలో తీసుకుంటున్నాం అనే దానిపైనే మన ఫిజిక్ ఆధారపడి ఉంటుందని శిల్పా శెట్టి ‘ది గ్రేట్ ఇండియన్ డైట్’ అనే పుస్తకంలో రాసుకొచ్చింది.