పోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో మరో మలుపు తిరిగింది. ముంబై జుహూలోని శిల్పాశెట్టి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. వారి వెంట రాజ్ కుంద్రా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించి మరింత లోతుగా విచారించడానికి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శిల్పాశెట్టిని ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
శిల్పాశెట్టి.. వియాన్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు. ఇటీవలే అంధేరీ వెస్ట్ లోని వియాన్ కార్యాలయంపై దాడి చేసిన పోలీసులు భారీగా పోర్న్ వీడియోల డేటాను సేకరించారు. అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన కుంద్రా పోలీసు కస్టడీను ముంబై మేజిస్ట్రేట్ జూలై 27వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు రాబట్టడానికి ప్రయత్నించగా.. ఆయనేం మాట్లాడడం లేదని తెలుస్తోంది.
దీంతో కేసు దర్యాప్తులో భాగంగా శిల్పాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్ కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో శిల్పాశెట్టి ప్రమేయం ఏమైనా ఉందా అనే విషయంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కేసుతో శిల్పాకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని జాయింట్ పోలీస్ కమిషనర్ తాజాగా మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే!