Shilpa Shetty: స్టార్ హీరో సినిమాలో తెలుగు రీ ఎంట్రీ ఇవ్వనున్న శిల్పా శెట్టి?

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది.తెలుగులో కూడా పలు సినిమాలలో నటించిన శిల్పా శెట్టి అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ ఈమె వరస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే చాలా సంవత్సరాలు తర్వాత ఈ హీరోయిన్ తిరిగి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఓ సీనియర్ హీరో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు తన చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ శిల్పా శెట్టి ని సంప్రదించగా ఈ సినిమాలో నటించడానికి శిల్పా శెట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాలో శిల్పా శెట్టి రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించనున్నారట.

ఇలా పవర్ ఫుల్ పాత్ర ద్వారా శిల్పా శెట్టి తెలుగులోకి చాలా గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలబడునున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలతో పాటు వరుస వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus