మా అమ్మకు నరకం చూపించాను!

  • September 12, 2023 / 06:50 PM IST

పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి ఓ ఇంటర్వ్యూలో తాను పుట్టేటప్పుడు పడ్డ కష్టాల గురించి చెబుతూ ఈ ముద్దు గుమ్మ ఎమోషనల్ అయ్యింది. తాను పుట్టడానికే ఎన్నో కష్టాలు పడ్డాను అని తెలిపిన ఈ ముద్దుగుమ్మ తన వల్ల వాళ్ల అమ్మ చాలా కష్టపడిందని తెలిపింది. శిల్పా కడుపులో పడ్డప్పటి నుంచే వాళ్ల అమ్మకు ఎప్పుడూ రక్తస్రావం అవుతూ ఉండేదట. దీంతో అబార్షన్ చేయించుకోవాలని చెప్పిన వాళ్ల అమ్మ ఎంతో ధైర్యంతో తనని కన్నదని చెప్పుకొచ్చింది .

ఈ బాలీవుడ్ బ్యూటీ. తన బర్త్ స్ట్రగుల్ గురించి చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చిన శిల్పాశెట్టి.. ‘ నేను అనుకోకుండా ఈ భూమి మీద పడ్డాను. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే చచ్చి బతికాను. నేను కడుపులో పడ్డప్పటినుంచి మా అమ్మకు నిరంతరం రక్తస్రావం జరిగేదంటా. మా అమ్మ నా వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. దీంతో అమ్మకు ఏం కాకుండా ఉండాలంటే అబార్షన్ చేయాలని వైద్యులు సిఫార్సు చేశారు.

ఇక నన్ను (Shilpa Shetty) కోల్పోతున్నాననే ఆందోళనతో అమ్మ చాలా ఒత్తిడికి లోనైంది. కానీ, దేవుని దయవల్ల నేను బతికి బయటపడ్డాను. మా అమ్మ ఎప్పుడూ ఏదో ఒక ప్రయోజనం కోసమే నేను ఇక్కడకు వచ్చానని చెబుతూ ఉంటుంది. అదే విషయాన్ని ఆమె బలంగా కూడా నమ్ముతుంది’ అని తెలిపింది. ఇక శిల్పా శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సుఖీ సినిమా సెప్టెంబర్ 22న ఆన్ లైన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టా్ర్ లో విడుదల కానుంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus