Bigg Boss 7 Telugu: శివాజీని కావాలనే బయటకి పంపలేదా ? తెర వెనుక ఏం జరుగుతోందంటే.!

బిగ్ బాస్ హౌస్ లో నుంచీ ఆరోగ్య రీత్యా శివాజీ బయటకి వచ్చేస్తాడని చాలామంది అనుకున్నారు. కానీ, శనివారం నాగార్జున ఎపిసోడ్ లో శివాజీని కన్ఫషన్ రూమ్ కి పిలిచి మరీ మాట్లాడారు. తనకి చేయి చాలా నొప్పిగా ఉందని చెప్పాడు శివాజీ. ఫిజికల్ గా ఓకే, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నావా అని అడిగాడు కింగ్ నాగార్జున. దీంతో నేను మొండోడ్ని బాబుగారూ అంటూ సమాధానం ఇచ్చాడు. అంతేకాదు, ఫిజియో అయితే కొన్నిరోజులు నాకు సెట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు.

దీంతో నాగార్జున చాలా పర్సనల్ కేర్ తీస్కుని ఫిజియోని ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అయితే, ఇక్కడ శివాజీని ఎందుకు హౌస్ లో ఉంచారు ? దేనికోసం ఇదంతా చేస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి లాస్ట్ సీజన్ లో టాస్క్ లు అన్నీ కూడా సరిగ్గా ఆడకుండా తప్పుతప్పుగా ఆడారు. హౌస్ లో సరిదిద్దే వారే లేరు. అంతేకాదు, ఎవరికి వారే యమునా తీరే అనే చందంగా గేమ్ ఆడారు. అందుకే ఆ సీజన్ ఫైయిల్ అయ్యింది. ఇప్పుడు శివాజీ నేతృత్వంలో గేమ్స్ బాగా ఆడుతున్నారు.

ఏదైనా మిస్టేక్ ఉన్నా, ఎవరిదైనా తప్పు ఉన్నా శివాజీ మాట అందరూ వింటున్నారు. అందుకే, శివాజీ కొన్ని వారాలు ఉండాలని బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఇక మరోవైపు పల్లవి ప్రశాంత్, యావర్ విషయంలో కూడా శివాజీ బాగా సపోర్ట్ చేస్తున్నాడు. వీరిద్దరికీ కూడా శివాజీ అవసరం ఉంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ శివాజీ సపోర్ట్ లేకపోతే ఇంట్లో సభ్యులతో వేగడం చాలా కష్టం. అందరూ ఏదో ఒకటి అంటూ మాటలు విసేరేవాళ్లే ఉన్నారు. ఇప్పుడు ప్రశాంత్ ని ఏదైనా అంటే శివాజీ ఉంటాడనే ఉద్దేశ్యంతో కొద్దిగా ఆగుతున్నారు. ఆచి తూచి మాట్లాడుతున్నారు. లేదంటే అందరూ ఏకమై గేమ్ లో తప్పించేస్తారనే టాక్ కూడా ఉంది.

కాబట్టి శివాజీ హౌస్ లో ఉండాల్సిన పరిస్తితులు ఉన్నాయి. నాగార్జున హోస్టింగ్ అనేది వారానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. హౌస్ లో మిగిలిన రోజులు శివాజీ ఉంటే టాస్క్ లలో డిసి ప్లైయిన్ గేమ్ అనేది కనిపిస్తోంది. శివాజీకి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా ఉంది. దీనివల్ల రేటింగ్ కూడా వస్తోంది. ఈ టైమ్ లో శివాజీని పంపించేస్తే రేటింగ్ మట్టిలో కలిసిపోతుంది. అందుకే, శివాజీ ఉండటం అనేది తప్పని సరిగా మారింది. అందుకే, చేయి బాగోకపోయినా ఫిజియో చేయించుకుని కనీసం సంచాలక్ గా అయినా సరే గేమ్ ఆడేలాగ ఉండాలని (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఈ ప్లాన్ వేసింది.

మరోవైపు అమర్ – సందీప్ – గౌతమ్ లకి శివాజీ యాంటీగా మారాడు. ముఖ్యంగా అమర్ విషయంలో ఫస్ట్ నుంచీ నెగిటివ్ వైబ్ ని తీస్కున్నాడు. అలాగే గౌతమ్ కూడా శివాజీని ఏదో ఒక విషయంలో ఆర్గ్యూమెంట్ లోకి లాగుతున్నాడు. వీరిద్దరి గేమ్ ని కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అందుకే, శివాజీ ఇంట్లో ఉండాలి. వీకండ్ నాగార్జున పార్టిసిపెంట్స్ కి అర్దం కాకపోయినా ఆడియన్స్ కి అర్దమయ్యేలాగా కన్ఫెషన్ రూమ్ లో శివాజీ హెల్త్ ని అడుగుతూ శివాజీ హౌస్ లో ఉండాలని చెప్పాడు. దీంతో శివాజీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదీ మేటర్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus