తెలుగు నటి శోభిత మోడల్ గా నిరూపించుకొని.. మిస్ ఇండియా(2013) గా కిరీటం దక్కించుకొని.. బాలీవుడ్ లో అడుగుపెట్టి.. తన ప్రతిభని చాటుకుంది. అక్కడ రెండు సినిమాలు చేసినప్పటికీ రాని గుర్తింపు తెలుగులో ఒక్క సినిమాతో వచ్చింది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన “గూఢచారి” సినిమాలో శోభిత అదరగొట్టింది. దీంతో టాలీవుడ్ లోనే కాకుండా ఆమె పేరు పొరుగు పరిశ్రమల్లోనూ బాగా వినిపించింది. దీంతో అనేక అవకాశాలు తలుపు తట్టాయి. వాటిలో రొటీన్ కథలను పక్కన పెట్టి వినూత్న కథకి ఒకే చెప్పింది. వేశ్యగా నటించడానికి ఓకే చెప్పింది. మలయాళ డైరక్టర్ జీతూ మోహన్ దాస్ “ముతోన్” అనే పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీ రోల్ చేయడానికి శోభితని సంప్రదించగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్రను చేయటం సాహసమని సినీ విశ్లేషకులు ఆమెను అభినందిస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత శోభితకి మరింత పేరు వస్తుందని జీతూ మోహన్ దాస్ చెప్పారు. శోభిత ఈ చిత్రంతో పాటు రెండు ద్విభాషా చిత్రాలను చేస్తోంది. అందులో మేడ్ ఇన్ హెవెన్ అనే చిత్రం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తెరకెక్కుతుండగా, ది బాడీ అనే సినిమా తెలుగు, హిందీ భాషలో రూపుదిద్దుకుంటోంది. ఇవి విజయం సాధిస్తే దక్షిణాదిలోని టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.