టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ వివాదంలో చికుక్కున్న సంగతి తెలిసిందే. సమంత ఇందులో నెగిటివ్ రోల్ లో అదీ ఉగ్రవాది పాత్రలో నటించడం విశేషం.ఈ పాత్ర కోసం సమంత చాలా హార్డ్ వర్క్ చేసింది..ఈ పాత్రలో సమంత ఎంత మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినట్టు ఇటీవల విడుదలైన ట్రైలర్ స్పష్టం చేసింది. అయితే ఈ ట్రైలర్ చూసిన తమిళ ప్రేక్షకులు సమంతను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.ఈ వెబ్ సిరీస్ ను రద్దు చేయాలనీ ఎండీఎంకే నేత ఎంపీ వైకో డిమాండ్ చేసారు.
ఈ క్రమంలో ఆయన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కి లేఖ రాసారు. తమిళ జనాలను తీవ్రవాదులు గా చూపించబోతున్న ఫామిలీ మ్యాన్ – 2 వెబ్ సిరీస్ ను రిలీజ్ కాకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే తమిళనాడు లో పుట్టి పెరిగిన నటి సమంత , తమిళ సంప్రదాయాలను , తమిళ జనాల మనోభావాలను కించపరిచేటువంటి వెబ్ సిరీస్ లో నటించడం అత్యంత బాధాకరం అని కూడా ఆయన పేర్కొన్నారు . అంతేకాదు తమిళ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా సంభాషణలు ,
సన్నివేశాలను ,చిత్రీకరించిన వారి ఫై కూడా లీగల్ యాక్షన్ తీసుకోవాలని, ఆదాయం కోసం వక్రీకరిస్తే మేము సహించమని, వెబ్ సిరీస్ విడుదల ను నిలిపి వేయకపోతే తీవ్ర నిరసనలకు దిగడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకాష్ జవదేకర్ కు ఎండీఎంకే తెలిపారు. మరి ఈ వివాదం పై జవదేకర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!