రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల్లో రాధేశ్యామ్ ఒకటి. ఈ సినిమా టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి యూ ట్యూబ్ లో టీజర్ పవర్ఫుల్ రికార్డును క్రియేట్ చేసింది. చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా సెన్సేషన్ రికార్డులను క్రియేట్ చేసేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. అయితే సినిమాలో ప్రభాస్ కాస్ట్యూమ్ కోసం నిర్మాతలు భారీ స్థాయిలో ఖర్చు చేశారట.
సినిమా పిరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ వేసుకున్న కాస్ట్యూమ్ ఈ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట. ప్రభాస్ స్నేహితుడైన కాస్ట్యూమ్ డిజైనర్ భాస్కర్ స్పెషల్ గా ఏడాది పాటు రీసెర్చ్ చేసి మరీ ప్రభాస్ కు డ్రెస్ సెట్ చేయించాడట. అసలు మ్యాటర్ లోకి వెళితే.. కేవలం సినిమా మొత్తంలో డ్రెస్సుల కోసమే 6కోట్ల వరకు ఖర్చు చేయించారని తెలుస్తోంది.
సినిమా మొత్తంలో ప్రభాస్ ఒక న్యూ రొమాంటిక్ లుక్ లో కానీ కనిపిస్తాడాని సమాచారం. పూజా హెగ్డే కూడా సినిమాలో చాలా అందంగా కనిపించనున్నట్లు టీజర్ ద్వారానే క్లారిటీ వచ్చింది. మ్ మరి దర్శకుడు రాధాకృష్ణ ఈ స్టార్స్ జోడిని ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడో చూడాలి. రాధేశ్యామ్ సినిమా జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?