Thandel: ‘తండేల్’ కి అక్కడ ప్రమోషన్ ఖర్చులు కూడా రికవరీ కాలేదా?

Ad not loaded.

‘కార్తికేయ 2’ (Karthikeya 2) తో హిందీలో కూడా సూపర్ హిట్ కొట్టాడు దర్శకుడు చందూ మొండేటి  (Chandoo Mondeti). ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా అక్కడి బయ్యర్స్ కి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఆమిర్ ఖాన్ (Aamir Khan) వంటి స్టార్ హీరో నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) పక్కన రిలీజ్ అయినప్పటికీ.. నార్త్ ఆడియన్స్ ‘కార్తికేయ 2’ కి ఓటేశారు. అక్కడి బయ్యర్స్ కి భారీ లాభాలు అందించింది ఈ సినిమా. చందూ మొండేటి పేరు నార్త్ లో కూడా మార్మోగింది.

Thandel

ఆ సినిమాకు గాను ఇతనికి నేషనల్ అవార్డు కూడా లభించిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా చందూ మొండేటికి మంచి పాపులారిటీ దక్కింది. అతని పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని ‘తండేల్’ (Thandel) సినిమాని రూ.90 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు బన్నీ వాస్ (Bunny Vasu)  , అల్లు అరవింద్ (Allu Aravind) . ప్రమోషన్ కూడా అన్ని రాష్ట్రాలు వెళ్లి ఎంతో ఖర్చుపెట్టి చేశారు.

కానీ ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ‘తండేల్’ తెలుగులో బాగానే ఆడుతున్నా.. మిగతా భాషల్లో మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు.ముఖ్యంగా హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని.. పాకిస్తాన్ జైలు సీన్స్ పెంచి.. అక్కడ దేశభక్తి ఎమోషన్స్ కూడా గట్టిగా పెట్టాడు చందూ మొండేటి. అవన్నీ నార్త్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసినవే. కానీ నార్త్ లో ఈ సినిమాని ప్రేక్షకులు పూర్తిగా రిజెక్ట్ చేశారు.

అక్కడ మొత్తం కలిపి రూ.15 లక్షలు నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. నార్త్ ఆడియన్స్ కోసం పెట్టిన పాకిస్తాన్ జైలు సీన్స్ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదు. సినిమాకి అవే మైనస్ అని చాలా మంది పెదవి విరిచారు. ఏదేమైనా నార్త్ లో…. ‘కార్తికేయ 2’ సక్సెస్ ‘తండేల్’ కి కలిసి రాలేదు అనే చెప్పాలి.

అల్లు అర్జున్ – అట్లీ.. చప్పుడు లేకుండా అన్నీ జరిగిపోతున్నాయిగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus