Hyper Aadi: హైపర్ ఆదిపై నటుడి సంచలన ఆరోపణలు..?

  • June 18, 2021 / 05:10 PM IST

మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. నిజ జీవితంలో కూడా రక్త సంబంధం లేకపోయినా ఒకే పోలికలతో ఉన్న వ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు. జబర్దస్త్ షో ద్వారా దొరబాబు కమెడియన్ గా గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దొరబాబు గతంలో ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. అయితే దొరబాబు పోలికలతో ఉండే దావూద్ అనే నటుడు దొరబాబు వల్ల తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.

దావూద్ ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వారు. ఒక పక్క సీరియల్స్ తో బిజీగా ఉన్న దావూద్ మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తుండటం గమనార్హం. హైపర్ ఆది గతంలో చేసిన ఒక కవలల స్కిట్ లో దావూద్ చేయగా అలా చేయడం తాను చేసిన పెద్ద తప్పు అని దావూద్ అన్నారు. దొరబాబు, తాను వేరువేరని చెప్పాలని హైపర్ ఆదిని కోరారని హైపర్ ఆది క్లారిటీ ఇస్తానని చెప్పి ఆ తరువాత టెక్నికల్ కారణాల వల్ల అలా చెప్పడం లేదని తనకు చెబుతున్నాడని దావూద్ పేర్కొన్నారు.

జబర్దస్త్ హైపర్ ఆది స్కిట్లు ఫాలో అయ్యేవాళ్ల నుంచి తనకు ప్రాబ్లమ్ అని ఆదితో తాను రెండు మూడు సినిమాలు కలిసి పని చేశానని దావూద్ అన్నారు. హైపర్ ఆది క్లారిటీ ఇస్తే తనకు మెంటల్ ప్రెజర్ తగ్గుతుందని దావూద్ తెలిపారు. తాను సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తుంటే దొరబాబుకు కాల్స్ వెళుతున్నాయని అతను కూడా అవును తానే నటించానని చెబుతున్నట్లు తన సన్నిహితులు చెప్పారని దావూద్ అన్నారు. హైపర్ ఆది ఎప్పుడూ ఏదో ఒక కారణం చెప్పి మోసం చేస్తున్నారు అనేలా దావూద్ కామెంట్లు చేయడం గమనార్హం.


బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus