NTR30: జూనియర్ ఎన్టీఆర్ కోసం కొరటాల శివ టైటిల్ కాపీ చేశాడంటూ కామెంట్స్..!

సినిమా పరిశ్రమలో జయాపజయాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు.. అన్ని సినిమాలూ ఆడాలనే తీస్తారు.. ఒక్కోసారి ఫలితం అంత ఆశాజనకంగా ఉండకపోయి.. కొన్ని సార్లు మాత్రం ఊహించని విధంగా విజయాలు సాధిస్తుంటాయి.. ఆడితే అందరూ బాగుంటారు.. తేడా వస్తే నిర్మాత నష్టపోతాడు.. దర్శకుడికి అవకాశాలు రావు.. నటీనటులకు ఎదురు చూపులు తప్పవు..అనుకోకుండా ఇచ్చిన ఒక్క ఫ్లాపు కారణంగా డైరెక్టర్ కొరటాల శివని ఇప్పటికీ వదలట్లేదు కొందరు.. వీరిలో మెగా ఫ్యాన్స్.. మూవీ లవర్స్..

ఇండస్ట్రీ వాళ్లు కూడా ఉన్నారు. ‘ఆచార్య’ కథ, టైటిల్ కాపీ ఆరోపణలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే.. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. కట్ చేస్తే రిజల్ట్ తేడా కొట్టేసింది.. డిజాస్టర్ అవుతుందని ఎవరూ అనుకోలేదసలు..స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నుంచి ఫ్యాన్స్ వరకూ చాలా మంది మీడియా, సోషల్ మీడియా ద్వారా కొరటాలని నానా మాటలూ అన్నారు.. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్లు అయితే..

తమ నష్టాలను భర్తీ చేయమని ఏకంగా కొరటాల ఇంటి ముందు ధర్నా చేశారు.. ఇదిలా ఉంటే.. తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించబోయే మూవీని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తూ.. కథ మీద మరింత ఫోకస్ పెట్టాడు శివ.. తారక్ 30వ సినిమా ఇది.. కొద్ది రోజులుగా టైటిల్ గురించి వార్తలొస్తున్నాయి..రీసెంట్‌‌గా ఫిలింనగర్‌లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తోంది.. శివ – ఎన్టీఆర్ మూవీకి ‘దేవర’ అనే పేరు రిజిష్టర్ చేయించారని..

గతంలో ‘ఆచార్య’ కథ నాదేంటూ మీడియా ముందుకొచ్చిన వ్యక్తిదే ఈ ‘దేవర’ టైటిల్ అని.. అప్పుడు కథ కాపీ.. ఇప్పుడు టైటిల్ కాపీ అనే మాటలు వినిపిస్తున్నాయి.. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ లాంటి హిట్స్ తీసిన కొరటాల గురించి ఇలాంటి కామెంట్స్ రావడం ఆశ్చర్యమే..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus