ఈమథ్యే ‘కభీర్ సింగ్’ చిత్రంతో బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగా. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంటనే ఈ అదే చిత్రాన్ని బాలీవుడ్లో కూడా తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడు సందీప్. సక్సెస్ తో పాటు తీవ్రమైన విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు సందీప్. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ పై చెయ్యి చేసుకునే సీన్లపై ఎదురైన ప్రశ్నకు.. ‘ప్రేమికుల మధ్య తిట్టుకుని, కొట్టుకునే స్వాతంత్య్రం లేకుంటే.. అది నా దృష్టిలో ప్రేమకాదంటూ’ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ల పై చిన్మయి, సమంత ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు.
చిన్మయి, సమంతలతో పాటు అనసూయ, మంచు లక్ష్మీ కూడా సందీప్ వ్యాఖ్యల పై మండిపడ్డారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో తాప్సి కూడా జాయిన్ అయ్యింది. విషయం ఏంటంటే.. ఇటీవల మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన ప్రియురాలి పై అనుమానంతో ఆమె తల పగలగొట్టి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన పెద్ద సంచలనమే అయ్యింది. అయితే ఈ వార్తకు సంబంధించిన ఓ పేపర్ ఆర్టికల్ ను తాప్సి తన సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. ‘అనుమానంతో తల పగలగొట్టాడా..? బహుసా వారిద్దరూ పిచ్చి ప్రేమలో ఉన్నారనుకుంట. తన నిజమైన ప్రేమను నిరూపించుకోవడానికే.. ఇలా ఆమెను చంపేసుంటాడు’ అంటూ సందీప్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చింది. తాప్సీ ఇలా సందీప్ పై కౌంటర్ వేయడంతో ఆమె పై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘తాప్సి.. నీకు చాలా ఎటకారం ఉంది’ అంటూ కామెంట్స్ పెడుతూ ఫైరవుతున్నారు.