Bigg Boss Telugu OTT: ఓటింగ్ లో టాప్ ఎవరున్నారు? ఈవారం ఎవరు ఇంటి నుంచీ వెళ్లిపోబోతున్నారో తెలుసా?

  • March 12, 2022 / 02:36 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం ఎలిమినేషన్ అనేది ఉత్కంఠంగా ఉండబోతోంది. ఫస్ట్ వీక్ సీనియర్స్ లో ఒకరైన ముమైత్ ఖాన్ వెళ్లిపోయినట్లుగానే, ఈసారి కూడా సీనియర్స్ నుంచే ఒకరు వెళ్లిపోబోతున్నారా అనేది ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ లో ఆసక్తిని కలిగిస్తోంది. మనం ఈవారం నామినేషన్స్ ని చూసినట్లయితే ఏకంగా 11మంది ఉన్నారు. ఇందులో 7గురు సీనియర్స్ ఉన్నారు. అఖిల్, మహేష్ విట్టా, నటరాజ్ మాస్టర్, అరియానా, హమీదా, అషూరెడ్డి ఇంకా సరయు ఉన్నారు.

Click Here To Watch Now

4గురు జూనియర్స్ ఉన్నారు. వీరిలో అనిల్ రాథోడ్, శ్రీరాపాక, మిత్రాశర్మా, ఇంకా యాంకర్ శివలు ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది. అందుకే ఇప్పుడు శనివారం నాగార్జున ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా మారింది. నిజానికి మనం సేఫ్ జోన్ లో హౌస్ మేట్స్ ని చూసినట్లయితే, అఖిల్ ఇంకా అరియానా ఇద్దరికీ ఢోకాలేదు. ఫస్ట్ డే నుంచీ కూడా ఓటింగ్ అనేది బాగానే జరిగింది.

ఇక నెక్ట్స్ యాంకర్ శివ, అషూరెడ్డి ఇంకా హమీదాలు కూడా సేఫ్ లోనే ఉన్నారు. ఇక మిగిలింది ఆరుగురు. వీరిలో ముఖ్యంగా సరయు ఫస్ట్ వీక్ ఫీవర్ నుంచీ గట్టెక్కేసింది. అలాగే సెకండ్ వీక్ తన ఓటింగ్ పర్సెంటేజ్ ని మెరుగుపరుచుకుంది. సో సేఫ్ లోకే వెళ్లిపోయింది. ఇక ముగ్గురు మేల్ పార్టిసిపెంట్స్ లో అనిల్, నటరాజ్ మాస్టర్, ఇంకా మహేష్ విట్టాలు డేంజర్ జోన్ లో ఉన్నారు. అలాగే ఫిమేల్ పార్టిసిపెంట్స్ లో శ్రీరాపక, ఇంకా మిత్రాశర్మలు డేంజర్ జోన్ లో ఉన్నారు.

ఇక బిగ్ బాస్ దిమ్మతిరిగే ఎలిమినేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సీనియర్స్ లో నుంచీ ఒకర్ని ఇంటికి పంపించేస్తారు. ఇలా పంపించేయాల్సి వస్తే నటరాజ్ మాస్టర్ ఇంకా మహేష్ విట్టాలు మాత్రమే లీస్ట్ లో ఉన్నారు. ఒక ఫిమేల్ కంటెస్టెంట్ అయిన ముమైత్ ఖాన్ ఫస్ట్ వీక్ వెళ్లిపోయింది కాబట్టి ఇప్పుడు మేల్ కంటెస్టెంట్ ని పంపించాలి అని అనుకుంటే మాత్రం ఈ దిమ్మతిరిగే ఎలిమినేషన్ జరుగుతుంది. మహేష్ విట్టా, నటరాజ్ మాస్టర్ లలో ఒకరికి గండం తప్పదు.

అలా కాకుండా ఎవరైనా సరే పర్లేదని లీస్ట్ లో ఉన్నవారిని ఎలిమినేట్ చేయాల్సి వస్తే మాత్రం శ్రీరాపక, మిత్రాశర్మ ఇంకా అనిల్ వీళ్ల మద్యలోనే ఎలిమినేషన్ అనేది ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఒక సీనియర్ హౌస్ మేట్ ఫస్ట్ వీక్ వెళ్లిపోయింది కాబట్టి, ఇంకో జూనియర్ టీమ్ నుంచీ హౌస్ మేట్ ని ఎలిమినేట్ చేద్దామనుకున్నా వీళ్ల ముగ్గురులో నుంచీ ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus