Jia Sharma: ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ జియా శర్మ గురించి షాకింగ్ నిజాలు..!

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ గా అలాగే తమిళంలో ‘ఆదిత్య వర్మ’ గా రీమేక్ చెయ్యగా అక్కడ కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇదిలా ఉండగా.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో నటించిన హీరోయిన్ షాలిని పాండే,

కమెడియన్ రాహుల్ రామకృష్ణ వంటి వారికి కూడా బిజీ ఆర్టిస్టులు రాణిస్తున్నారు. అయితే ఇదే సినిమాలో మరో హీరోయిన్ జియా శర్మ కూడా నటించిన సంగతి తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ లో ఆమె హీరోయిన్ పాత్రను పోషించింది. ఈమెది చిన్న పాత్రే అయినప్పటికీ.. తన లుక్స్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈమెకు కూడా వరుస అవకాశాలు వస్తాయి అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే తర్వాత ఈమె ఒక్క సినిమాలో కూడా నటించలేదట. ఇందుకు ప్రధాన కారణం ఆమె కన్నతల్లి అని తెలుస్తుంది.

జియా శర్మ … తండ్రి లేకపోవడంతో తల్లిని ప్రాణంగా చూసుకునేదట.ఆమె క్యాన్సర్ కు గురవ్వడంతో.. కంటికి రెప్పలా చూసుకునేదట.అందుకోసమే సినిమాలను పక్కన పెట్టేసిందట. అంత త్యాగం చేసినా తన తల్లి ప్రాణాలు కాపాడుకోలేక పోయింది అని జియా శర్మ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్నట్టు కూడా ఈ అమ్మడు తెలిపింది. మరి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి..!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus