టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి పదేళ్లకు సినిమాలను చూసే విషయంలో ప్రేక్షకుల అభిప్రాయం మారుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మాయిలను చెడ్డగా చూపిస్తే మూవీ హిట్ అవుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కుమారి 21ఎఫ్, ఆర్.ఎక్స్100, బేబీ సినిమాలలో హీరోయిన్ పాత్రలను కొంత సమయం పాజిటివ్ గా కొంత సమయం నెగిటివ్ గా చూపించడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి కొందరు దర్శకులు ఇదే తరహా కథలతో సినిమాలను తెరకెక్కించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్ల పాత్రలను పాజిటివ్ గా చూపిస్తే మాత్రమే సినిమాలు హిట్టయ్యేవి. ఇప్పుడు మాత్రం హీరోయిన్ల పాత్రలను నెగిటివ్ గా చూపిస్తేనే సినిమాలు హిట్టవుతున్నాయి. రాబోయే రోజుల్లో హీరోయిన్ల పాత్రలను మరింత యాటిట్యూడ్ తో, మరింత నెగిటివ్ గా చూపించనున్నారని సమాచారం అందుతోంది. ఈ హీరోయిన్ల పాత్రల విషయంలో నెటిజన్ల నుంచి నెగిటివ్ ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి.
హీరోల పాత్రలు సైతం పాజిటివ్ గా కంటే నెగిటివ్ గా చూపిస్తేనే సినిమాలు సక్సెస్ సాధిస్తాయని ఇప్పటికే పలు సినిమాలు ప్రూవ్ చేసిన సంగతి తెలిసిందే. కుమారి 21ఎఫ్, ఆర్.ఎక్స్100, బేబీ సినిమాలలో నటించిన హీరోయిన్లు కొత్త హీరోయిన్లు కావడం గమనార్హం. స్టార్ హీరోయిన్లు ఇలాంటి పాత్రలలో నటించడానికి రిస్క్ అని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమాల రూపురేఖలు మారుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హీరోయిన్ల పాత్రల విషయంలో మరీ హద్దులు దాటి చూపించడం కూడా కరెక్ట్ కాదని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే నెగిటివ్ తరహా పాత్రలు హీరోయిన్లకు మంచి పేరు తెస్తున్నా ఆయా హీరోయిన్లు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!