టాలీవుడ్ ప్రముఖ రచయితలలో విజయేంద్ర ప్రసాద్ ఒకరనే సంగతి తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల ద్వారా విజయేంద్ర ప్రసాద్ కు రచయితగా మరింత మంచి గుర్తింపు దక్కడం గమనార్హం. తాజాగా విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ కావడంతో జక్కన్న అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ ను ఎక్కువమంది ప్రశంసిస్తుండగా కొంతమంది మాత్రం ఆయన రాజ్యసభకు నామినేట్ కావడం గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
విజయేంద్ర ప్రసాద్ స్వస్థలం కోడూరు కాగా విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు ఎంపికయ్యారని తెలిసి కొవ్వూరులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ మాజీ ఎమ్మెల్సీ శివరామకృష్ణకు విజయేంద్ర ప్రసాద్ పెదనాన్న కొడుకు కావడం గమనార్హం. విజయేంద్ర ప్రసాద్ తండ్రి పేరు కోడూరి అప్పారావు కాగా కొవ్వూరు, ఏలూరు ప్రాంతాలలో విజయేంద్ర ప్రసాద్ చదువుకున్నారు. ఇక్కడినుంచి విజయేంద్ర ప్రసాద్ కుటుంబం కర్ణాటకలోని తుంగభద్ర ప్రాంతానికి వెళ్లగా వీళ్ల ఫ్యామిలీ అక్కడ కొన్ని వ్యాపారాలు చేసినా అనుకూల ఫలితాలు రాలేదు.
ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్ సోదరుడు శివశక్తి దత్తా ఇండస్ట్రీలో ఉండటంతో ఆయన ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చారు. మద్రాస్ లో పలు సినిమాలకు రైటర్ గా పని చేసి విజయేంద్ర ప్రసాద్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ విజయేంద్ర ప్రసాద్ కు రచయితగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఎంతో ప్రతిభ ఉన్న వ్యక్తి అయిన విజయేంద్ర ప్రసాద్ కు రాజ్యసభ సీటు ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
విజయేంద్ర ప్రసాద్ కెరీర్ లో మరెన్నో విజయాలను అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. బాలయ్య నటించిన పలు హిట్ సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథలు అందించారు. అయితే విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో కొన్ని సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!