నందమూరి తారకరత్న 22 సినిమాలలో నటించగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించకపోయినా నటుడిగా తారకరత్న మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్రధాని మోదీతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తారకరత్న మృతి గురించి సంతాపం తెలియజేశారు. తారకరత్న మరణ వార్త విన్న క్షణం నుంచి ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకే సమయంలో తొమ్మిది సినిమాలకు కొబ్బరికాయ కొట్టి ఎంట్రీతోనే తారకరత్న రికార్డ్ సృష్టించారు.
ప్రపంచంలో ఈ ఘనతను కలిగి ఉన్న ఏకైక హీరో తారకరత్న కావడం గమనార్హం. అయితే ఈ 9 సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రమే షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలయ్యాయి. అమరావతి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించిన తారకరత్నకు తర్వాత రోజుల్లో సైతం నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ దక్కాయి. రాజా చెయ్యి వేస్తే సినిమాలో మరోసారి ప్రతినాయకుని పాత్రలో నటించి తారకరత్న ఆకట్టుకున్నారు.
తారకరత్న అలేఖ్యల పెళ్లి ప్రేమ పెళ్లి కాగా వీళ్లిద్దరి మ్యారేజ్ లో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. పలు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లలో ఛాన్స్ రావడంతో పాటు రాజకీయాల దిశగా తారకరత్న అడుగులు వేస్తున్న సమయంలో గుండెపోటు వల్ల తారకరత్న ఆస్పత్రిలో చేరారు. రాజకీయాల్లో సక్సెస్ కావాలనే కోరిక నెరవేరకుండానే ఆయన కన్నుమూశారు.
తారకరత్న కుటుంబానికి దేవుడు అన్యాయం చేశాడని నెటిజన్ల నుంచి సైతం కామెంట్లు వినిపిస్తున్నాయి. తారకరత్న చేతిపై సింహం బొమ్మ టాటూ ఉండగా ఆ బొమ్మ కింద తారకరత్న బాలయ్య ఆటోగ్రాఫ్ ఉంటుంది. నందమూరి కుటుంబంలో తారకరత్నకు అత్యంత ఇష్టమైన వ్యక్తి బాలయ్య కాగా తారకరత్న కెరీర్ పరంగా తీసుకున్న నిర్ణయాల విషయంలో బాలయ్య పాత్ర ఎంతో ఉంది. తారకరత్న గొప్పదనం, మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.