NTR30: ఆ పండుగల కోసమే తారక్ ఇలా ప్లాన్ చేశారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్న సంగతి తెలిసిందే. అయితే న్యూ ఇయర్ కానుకగా ఎన్టీఆర్30 టీమ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. 2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ తేదీనే మేకర్స్ ఎంచుకోవడం వెనుక అసలు రీజన్ వేరే ఉందని సమాచారం అందుతోంది.

ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం వల్ల ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఢోకా ఉండదని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ఏప్రిల్ నెల 9వ తేదీన ఉగాది పండుగ కాగా ఏప్రిల్ 11వ తేదీన ఈద్, ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామ నవమి కావడంతో రెండు వారాల పాటు ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ముందుగానే రిలీజ్ డేట్ ను ప్రకటించడం ద్వారా ఆ తేదీకి మరో సినిమా మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తారక్ కొరటాల శివ ఈ సినిమా విషయంలో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారని బోగట్టా. మొదట అనుకున్న కథ కాకుండా మరో కథపై కొరటాల శివ దృష్టి పెట్టడంతో ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతుండటం గమనార్హం.

తారక్30 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తారక్ కొరటాల శివ కాంబో మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ కాగా త్వరలో హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూట్ ఈ ఏడాదే పూర్తి కానుందని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని సమాచారం.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus