Pushpa Movie: పుష్ప ప్రమోషన్ల వెనుక అసలు కథ ఇదే!

2020 సంవత్సరంలో అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే 2021 సంవత్సరంలో పుష్ప ది రైజ్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. స్టార్ హీరో అల్లు అర్జున్ వరుసగా రెండు సంవత్సరాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది పుష్ప ది రూల్ తో కూడా బన్నీ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బన్నీ త్వరలో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్నా కరోనా ప్రజలపై తక్కువ ప్రభావం చూపిస్తుండటంతో పుష్ప ది రూల్ షూటింగ్ త్వరలోనే మొదలయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పుష్ప బాలీవుడ్ లో ఏకంగా 100 కోట్ల రూపాయల మార్కును టచ్ చేయడం గమనార్హం. అయితే సాధారణ ప్రేక్షకులతో పాటు క్రికెటర్లు కూడా ఈ సినిమాకు ఫిదా అయిన సంగతి తెలిసిందే. కొంతమంది క్రికెటర్లు పుష్ప మేనరిజమ్స్ ను సోషల్ మీడియాలో పెట్టారు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ క్రికెటర్లకు డబ్బులు ఇచ్చి క్రికెటర్స్ తో ప్రచారం చేయించిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలోని పాపులర్ ఓటీటీలలో అమెజాన్ ప్రైమ్ ఒకటి. పుష్ప సినిమాను ప్రమోట్ చేసినా ప్రమోట్ చేయకపోయినా అమెజాన్ కు ఎటువంటి నష్టం రాదు. పుష్ప మేనియా వల్లే క్రికెటర్లు పుష్పరాజ్ పాత్ర మేనరిజమ్స్ ను ఫాలో అయ్యారని తెలుస్తోంది. పుష్ప ది రైజ్ తో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన బన్నీ పుష్ప ది రూల్ తో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది.

సుకుమార్ ఫస్ట్ పార్ట్ ను మించి సెకండ్ పార్ట్ ఉండే విధంగా ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తోంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus