మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో వివాదాలకు దూరంగా ఉన్నారు. తన సినిమాలు ఫ్లాపైన సమయంలో చిరంజీవి డబ్బులు వెనక్కు ఇచ్చిన సందర్భాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. అయితే చిరంజీవి ఎన్ని మంచి పనులు చేసినా కొంతమంది మాత్రం ఆయనను కావాలనే ట్రోల్ చేస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో ఆయనపై ఊహించని స్థాయిలో ట్రోల్స్ జరిగాయి. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించిన సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థుల నుంచి భారీ మొత్తం తీసుకున్నారని ఆరోపణలు వినిపించాయి.
పార్టీని మరో జాతీయ పార్టీలో విలీనం చేసిన సమయంలో భారీ మొత్తంలో ఆ పార్టీ ఆఫర్ చేయడం వల్లే చిరంజీవి పార్టీని విలీనం చేశారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే గాడ్ ఫాదర్ నిర్మాతలలో ఒకరైన ఎన్వీ ప్రసాద్ తాజాగా గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా చిరంజీవికి అప్పులు మిగిలాయని ఆ అప్పులు భారీగా ఉండటంతో చిరంజీవి ఆ అప్పులను తీర్చడానికి ఖరీదైన స్థలాన్ని విక్రయించారని ఎన్వీ ప్రసాద్ తెలిపారు.
చిరంజీవి కొందరిని దూరం చేసుకోవాలని ఎన్వీ ప్రసాద్ సూచించగా ఆ కొందరు ఎవరా? అనే చర్చ జరుగుతోంది. ప్రజారాజ్యం విషయంలో జరిగిన తప్పులు జనసేన విషయంలో జరగలేదని ఆయన అన్నారు. మరోవైపు చిరంజీవి జనసేనకు అంతకంతకూ దగ్గరవుతూ ఉండటం మెగాభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. చిరంజీవి పవన్ కళ్యాణ్ కలిస్తే రాజకీయాల్లో కూడా సంచలనాలు నమోదవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
టీడీపీ, వైసీపీలకు ధీటుగా జనసేన ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఫ్యాన్స్ కోరిక నిజం కావడానికి ఎంతో సమయం పట్టదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది చిరంజీవి నటించిన రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.